HomeBusinessCar care: మన కారుపై తెలియకుండా గీతలు పడితే మనసంతా చివుక్కుమంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Car care: మన కారుపై తెలియకుండా గీతలు పడితే మనసంతా చివుక్కుమంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Car care: చాలా ఇష్టంగా తీసుకున్న కొత్త కారుపై చిన్న గీత పడ్డా మనసంతా చివుక్కుమంటుంది. చాలా బాధ పడతాం. లక్షలాది రూపాయలు వెచ్చించి కొన్న కారుపై చిన్న గీత పడ్డా దాని విలువ తగ్గిపోతుంది. అందం చెడిపోతుంది. ఒక మచ్చలా కనిపిస్తుంది. కారు మీద ఎందుకు గీతలు పడతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది కారు కొనుక్కుని తిరగాలని కోరుకుంటారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్ముతో చిన్నదైనా సరే ఓ కారు కొనుక్కోవాలని ఆరాటపడుతుంటారు. ఇలా రూపాయ రూపాయి పోగేసుకుని కొనుక్కున్న కారును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కారు మెంటినెన్స్‌తోపాటు కారు ఎలివేషన్‌ కోసం అనేక ప్రయాసలు, తంటాలు పడుతుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చిన్నచిన్న పొరపాట్లు వల్ల కారుపై గీతలు పడితే చాలా బాధ అనిపిస్తుంది.

ర్యాష్‌ డ్రైవింగ్‌, చెట్ల ఆకులు తగిలి గీతలు పడితే దానికి ఎవరేం చేయలేం. జాగ్రత్తగా వెళ్లడమే ఉత్తమం. కానీ, కంటికి కనిపించని, సమస్యగా అనిపించని అంశాలు కూడా కారుపై గీతలు పడేందుకు కారణం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కారుపై వస్తువులను ఉంచరాదు..
కొందరు తెలియకుండానే చేసే తప్పు కారు బోనెట్‌పైనా, టాప్‌పైనా చేతిలో ఉన్నవస్తువులును పెట్టేస్తుంటారు. అదో అలవాటుగా మారడం వల్ల కారు పెయింటింగ్‌ డ్యామేజ్‌ అవుతుంది. కారు కీ చైన్‌ వల్ల కూడా పెయింటింగ్‌పై గీతలు పడే ఆస్కారం ఉంటుందని గమనించాలి. ఏ షాపింగ్‌కో ఇంకోచోటకో వెళ్లినప్పుడు అక్కడ కొన్న వస్తువులను ఓ కవర్‌లో పెట్టి తీసుకు వస్తారు. కారు వద్దకు వచ్చి ఆ లగేజిని కారులో పెట్టేముందు కారు ముందుభాగంలోనో, పైకప్పుపైనే ఉంచడం చాలా మంది చేసే పని. దీనివల్ల రాపిడి జరిగి కారుపై గీతలు పడతాయి. మెటల్‌ కీచైన్‌ కారుపై ఉంచడం వల్ల మనకు తెలియకుండానే గీతలు పడతాయి.

దుమ్ము, ధూళితోనూ గీతలు
ప్రాంతాన్ని బట్టి, మన కారు పార్కింగ్‌ చేసే ఏరియాను బట్టి కారుపై దుమ్ము, ధూళి ఎక్కువగా పడుతుంఆయి. ధూళి ద్వారా ఇసుకరాళ్లు కారుపై చేరుతాయి. ఇలాంటి సమయంలో మనం కారుపై చేతులు వేయడం వల్ల, కవర్లు, లేక ఇతర వస్తువులు పెట్టడం వల్ల ఇసుక రాళ్ల రాపిడి జరిగి కారు పెయింటింగ్ పై ప్రభావం చూపుతుంది. అంటే దుమ్ము, ధూళి వల్ల కూడా కారుపై గీతలు పడే అవకాశం ఉంటుంది.

కారును శుభ్రం చేసే సమయంలో..
కారు దుమ్ముపట్టిందని చాలా మంది క్లీన్‌ చేస్తుంటారు. తర్వాత తడిని తుడిచేందుకు అందుబాటులో ఉండే ఏదో రకమైన గుడ్డను వాడుతుంటారు. దీనివల్ల కూడా కారుపై గీతలు ఏర్పడే అవకాశం ఉంది. కారు పెయింటింగ్‌ ఎంతో మృదువుగా ఉంటుంది. మైక్రో ఫైబర్‌ క్లాత్‌ కాకుండా ఏదోరకమైన క్లాత్‌ వాడితే దానికున్న స్వభావం వల్ల కారుపై గీతలు ఏర్పడే అవకాశం ఉంది. కారును తుడవాలంటే మైక్రో ఫైబర్‌ క్లాత్‌ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కారుపై కూర్చోవడం
చాలామంది కారుపై కూర్చుంటుంటారు. ఇలా చేయడం వల్ల కారుకు ఏవిధమైన నష్టం లేదని భావిస్తారు. కానీ, కారుపై కూర్చోవడం వల్ల కూడా పెయింటింగ్‌ దెబ్బతింటుందన్న విషయం తెలుసుకోవాలి. కొంతమంది జీన్స్‌ ప్యాంట్లు వేసుకుంటారు. మరికొందరు రఫ్‌గా ఉండే దుస్తులు ధరిస్తారు. ఈ రకమైన బట్టలు వేసుకుని కారుకు కూర్చుంటే అప్పటికే కారుపై ఉండే దుమ్ముతో రాపిడి జరిగి గీతలు పడే ఆస్కారం ఉంటుంది. జీన్స్‌ బ్యాక్‌ పాకెట్‌కు ఉండే గుండీల వల్ల కారుపై గీతలు ఏర్పడతాయని గమనించాలి.

అదే క్లాత్‌ వద్దు!
కారును శుభ్రం చేయాలన్న లక్ష్యంతో ఇష్టారీతిన కొందరు వ్యవహరిస్తుంటారు. కారు చక్రాలను కడిగిన, శుభ్రం చేసిన బట్టతోనే కారు బయటి భాగాలనూ తుడుస్తుంటారు. ఇలాంటప్పుడు గీతలు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చక్రాలకు ఉండే మట్టిలో ఎన్నో రాళ్లు ఉంటాయి. కడిగే సమయంలో ఆ రాళ్లు క్లాత్‌లోకి వచ్చి చేరతాయి. అదేబట్టతో కారును తుడవడం వల్ల గీతలు ఏర్పడతాయి.

కారుపై కవర్‌ కప్పడం కూడా..
దుమ్ము, ధూళి, ఎండ, వాన వంటివాటి నుంచి రక్షణకు చాలా మంది కార్లపై కవర్లు కప్పడం చాలా మంది చేసే పని. ఇలా చేయడం వల్ల కూడా గీతలు పడే ఆస్కారం లేకపోలేదు. కవర్‌ కప్పే సమయంలోనూ, తీసే సమయంలోనూ కారు పెయింగ్‌పై ఉండే దుమ్ముతో రాపిడి జరుగుతుంది. కవర్‌కు ఉండే కఠినమైన స్వభావం వల్ల కారుపై గీతలు పడే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: State Election Commissioner: ఎలాంటి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరిగా పొందాలి
John Cena: న్యూడ్‌మెన్‌గా మారిన జాన్‌సెనా.. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం తిప్పలు!
Balala kosam: బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకం.. ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు