HomeLife StyleWeight Loss: బరువు తగ్గడంలో ఈ రూల్‌ గురించి మీకు తెలుసా? 30-30-30 అంటే ఏమిటి?

Weight Loss: బరువు తగ్గడంలో ఈ రూల్‌ గురించి మీకు తెలుసా? 30-30-30 అంటే ఏమిటి?

Weight Loss: ఊబకాయం, అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు తగ్గలేకపోతుంటారు. అలాంటి వారు తీసుకొనే ఆహారంలో మార్పులు చేయడం, ఆహారం తగ్గించడం, వ్యాయం చేయడం లాంటి వాటటితో ప్రయోగాలు చేస్తుంటారు.

బరువు ఈజీగా తగ్గాలనుకునే వారు 30-30-30 రూల్ (weight loss 30-30-30 rule) పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలేంటీ విధానం అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. బరువు ఎక్కువగా ఉన్నామని తెలిస్తే చాలు చాలామంది తీసుకునే ఆహారాన్ని తగ్గిస్తుంటారు. ఆహారం తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గుతారన్నది చాలా మందికి ఉండే భావన. మరికొందరు అతిగా వ్యాయామాలు చేసి ఇబ్బందులపాలవుతుంటారు.

బరువు తగ్గడం అనేది త్వరగా జరిగే పని కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సి అంశం. డైటింగ్ చేయడం, మితిమీరిన వ్యాయామం చేయడం, క్రాష్ డైట్ల పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడం చాలా మంది చేసే పని. ఇది ఏ మాత్రం సరైనది కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యకర విధానంలో శరీర బరువు తగ్గడానికి వైద్యులు 30-30-30 రూల్ సూచిస్తున్నారు.

వెయిట్‌ లాస్‌ కావడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో 30-30-30 రూల్ ఎంతో మంచి దని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా, ఆరోగ్యానికి మేలు చేసేలా బరువు తగ్గిపోవచ్చని చెబుతున్నారు.

అధిక బరువును తగ్గించడంలో భాగంగా ముందుగా 30 శాతం క్యాలరీలను తగ్గించి తీసుకోవడమే ఈ రూల్‌. శరీరానికి కావాల్సిన క్యాలరీల కన్నా 30 శాతం క్యాలరీలను తగ్గించుకోవడం అన్నమాట. మహిళలకు రోజుకు 2,000 క్యాలరీల శక్తి, పురుషులకు 2,500 క్యాలరీల శక్తి అవసరం సాధారణంగా అవుతుంది. ఈ రూల్ ప్రకారం అందులో 30 శాతాన్ని తగ్గించుకోవాలి. అంటే మహిళలు తమ శరీరానికి 1,400 క్యాలరీలు, పురుషులు 1,750 క్యాలరీలను తీసుకోవాల్సి ఉంటుంది.

అరగంట ఎక్సర్‌సైజులు..
అధిక బరువు నుంచి ఉపశమనం పొందడానికి మరో నియమం రోజులో కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం. చాలామంది శరీరానికి తగిన శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం జరుగుతుంటుంది. అయితే 30 నిమిషాల వ్యాయామాన్ని ముందుగా నడక, జాగింగ్, స్విమ్మింగ్ లాంటి ప్రక్రియలతో ప్రారంభించి తర్వాత కఠిన వ్యాయామాలకు వెళ్లాలి.

భోజనానికి 30 నిమిషాలు
చాలామంది తమ భోజనం చేసేటప్పుడు సమయపాలన పాటించరు. తింటున్నప్పుడు టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు లేదంటే వేరే స్క్రీన్లు చూస్తూ తింటారు. ఆహారాన్ని ఏకాగ్రతతో, బాగా నమిలి తినాలని పూర్వీకులు సైతం చెప్పిన మాట. ఇలా ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తింటే దానిలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందే పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారాన్ని తీసుకునేటప్పుడు 30 నిమిషాలు కేవలం దాని కోసం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గిపోవడం తేలిక.

30 శాతం క్యాలరీలను తగ్గించి స్వీకరించడం, అరగంట వ్యాయామం చేసుకోవడం, 30 నిమిషాలు భోజనానికి కేటాయించడం.. ఇలా 30-30-30 నిబంధన అనుసరిస్తే అధిక బరువు నుంచి తేలికగా బయట పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Weight lose home remedies: ఇంటి చిట్కాలతో బరువు తగ్గడం ఎలా?
Weight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..
Skipping: స్కిప్పింగ్ చేస్తే బరువు తగ్గుతారా? లాభాలు తెలుసుకోవాలా? అయితే ఈ కథనం మీకోసమే!
Lemon Tea Benefits: లెమన్‌ టీ తాగితే బరువు తగ్గడం గ్యారెంటీ..!
Weight Loss Drinks: బరువు తగ్గాలంటే ఏ డ్రింక్స్‌ తాగాలి? బెస్ట్‌ హెల్త్ టిప్స్ ఇవే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు