Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం కావాల్సినంత శరీరానికి అందాలి. కొందరికి వయసు, శరీర పరిస్థితులు, జబ్బుల దృష్ట్యా ఎముకల దృఢత్వం ఉండదు. అలాంటి వారు క్యాల్షియం మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం కరెక్టేనా? ఏమైనా సైడ్ ఎఫెక్టులు ఉంటాయా? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. క్యాల్షియం మాత్రల వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.
మన బాడీకి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే సంపూర్కణంగా ఆరోగ్యంగా ఉండటం వీలవుతుంది. వీటిలో కూడా కొన్ని పోషకాలు తప్పనిసరిగా అవసరం ఉంటాయి. సాధారణంగా క్యాల్షియం అనే పోషకం మన శరీరానికి తప్పనిసరిగా అంది తీరాలి. సరిపడా అందినప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలన్నా, మెదడు యాక్టివ్‌గా పని చేయాలన్నా క్యాల్షియం చాలా కీలకం.
ఎదుగుతున్న పిల్లలు, ఆడవారిలో, ముసలివారిలో సాధారణంగా క్యాల్షియం లోపం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే వైద్యులు క్యాల్షియం సప్లిమెంట్లను లేదా మాత్రలను సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే క్యాల్షియం మాత్రలు వేసుకోవడం అనేది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం ఆరోగ్యానికి ఎలాగైతే అవసరమో, శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ క్యాల్షియం శరీరానికి అందడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ట్యాబ్లెట్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా క్యాల్షియం అందేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
క్యాల్షియం వేటిలో అధికంగా ఉంటుందంటే..
బాడీకి కావాల్సిన క్యాల్షియంని మనం తీసుకునే పాలు, పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీరు లాంటి వాటి ద్వారా, పాలకూర, పప్పులు, బీన్స్, బఠాణీలు, సోయ వంటి వాటి ద్వారా లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి క్యాల్షియం అందించవచ్చు. బయటి నుంచి క్యాల్షియంను శరీరానికి అందించడం కన్నా సహజ పద్ధతుల్లో, ఆహారం ద్వారా అందించడం ఉత్తమమని వైద్యులు పేర్కొంటున్నారు.
మన శరీరానికి క్యాల్షియం తక్కువైతే చాలా వరకు క్యాల్షియం ట్యాబ్లెట్లు లేదంటే సప్లిమెంట్లు తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ క్యాల్షియంను కృత్రిమ పద్ధతిలో అంటే ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశాలు అధికంగా ఉంటాయట. క్యాల్షియం ఎక్కువైతే రాళ్ల రూపంలోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాల్షియం ఆక్సలేట్, క్యాల్షియం ఫాస్పేట్ కింద మారి శరీరానికి హాని కలిగిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే క్యాల్షియం తగినంత తీసుకోవడంతో పాటు విటమిన్ డి శరీరానికి అందితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు వివరిస్తున్నారు.
ఇవీ చదవండి: Muscle Health Food: ఎముకల పటిష్టత కోసం ఈ ఫుడ్స్ తీసుకోవడం మర్చిపోకండి!
Muscles Health: ఎముకల బలానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Bone Density: ఈ ఆహారాలు తింటే మీ ఎముకలు బలంగా తయారవుతాయి..
Ganji for Health: రోజుకో గ్లాసు గంజి తాగితే శరీరంలో ఆశ్చర్యపరిచే మార్పులు..!
