Weight lose home remedies: చాలా మంది బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆచరణలో కొందరు సాధిస్తారు. మరికొందరు మధ్యలోనే నిరాశ చెంది ప్రయత్నాలను విరమించుకుంటుంటారు. బరువు తగ్గే కసరత్తులో ముందుకు సాగుతూనే ఇంటి చిట్కాలు కూడా పాటస్తే సత్ఫలితాలు ఉంటాయని నిపుణులంటున్నారు. ఇందుకోస కొన్ని రకాల సూత్రాలు బోధిస్తున్నారు. ఇవి పాటిస్తే అధిక బరువు తగ్గడంతో పాటు పొట్టు చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించవచ్చని సూచిస్తున్నారు. (Weight lose home remedies)
బరువు తగ్గడం కోసం కొందరు ఇందుకోసం వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఏం తినాలి… ? ఎప్పుడు తినాలి..? ఎంత తినాలి..? అని డైట్‌చార్ట్ పెట్టుకుని ఆచరిస్తారు. అయితే… ఇంటి చిట్కాలతోనూ బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పలు పద్ధతుల్ని సూచిస్తున్నారు.
1. దాల్చిన చెక్క, హనీ టీ
దాల్చిన చెక్క అంటే ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ప్రతీ వంటింట్లో దాల్చిన చెక్క ఉంటుంది. దీనికి బరువును తగ్గించే గుణం ఉంటుంది. దాల్చిన చెక్క, తేనె కలిపిన టీ తాగితే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్‌గా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతో పాటు దాల్చినచెక్క, తేనె మిశ్రమం తాగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. శరీరంలో వేడి ఉత్పత్తయ్యి కేలొరీలు కరుగుతుందని 2012లో జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది.
2. పచ్చి వెల్లుల్లి
వంటింట్లోనే లభించే పచ్చి వెల్లుల్లి కూడా బరువు తగ్గేందుకు అద్భుతంగా పని చేస్తుంది. వంటల్లో రుచి, సువాసన కోసం వెల్లుల్లిని ఉపయోగిస్తాం. ఇది మంచి ఔషధం. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పచ్చి వెల్లుల్ని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో కీలకంగా పని చేస్తుంది.
3. లెమన్ వాటర్‌లో నెయ్యి
ఆరోగ్యానికి లెమన్ వాటర్ చాలా మేలు చేస్తుంది. శరీరంలో మలినాల తొలగింపుతో పాటు హైడ్రేషన్, జీవ క్రియల మెరుగుదల, బరువు తగ్గుదలకు దోహద పడుతుంది. రోజూ ఉదయం లెమన్ వాటర్ తాగితే శరీరంలో మలినాలు పేరుకుపోకుండా చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ వ్యవస్థను పెంచుకోవచ్చు. లెమన్ వాటర్‌కు తేనె కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
4. పెరుగు తీసుకుంటే బరువు తరుగు
బరువు తగ్గేందుకు చాలా ఉపయోగపడే మరో పదార్థం పెరుగు. ఆహారంలో రెగ్యులర్‌గా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలు మెరుగుపడుతాయని, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు నిరూపించాయి. పెరుగులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
5. చియా గింజలు
చియా గింజలు కూడా బరువు తగ్గించేందుకు కీలకంగా పని చేస్తాయి. వీటిల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి శరీర పనితీరును మెరుుపర్చుతాయి. ప్రతీ మనిషికి రోజుకు కావాల్సిన ఫైబర్‌లో… ఒక ఔన్స్ గింజల ద్వారానే 39శాతం అందుతుంది. చియా గింజల్లోని ఫైబర్ నీటిని పీల్చుకుంటుంది. పొట్టలో అవి పరిమాణం పెంచుకుంటాయి. కొన్ని గింజలు తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు. ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయవచ్చు.
Read Also : Weight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..