Sreemukhi: తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి పాటల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న పాట యేషనాగుల కట్టమీద. చాలా ఏళ్ల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జానపద గీతానికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో ఈ పాటను కొత్తగా ఉపయోగించడంతో ఒక్కసారిగా ఫోక్ సాంగ్ ట్రెండ్ మారిపోయింది. యూట్యూబ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ వరకు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన రీల్స్, డ్యాన్స్ వీడియోలే కనిపిస్తున్నాయి. ఈ క్రేజీ ట్రెండ్‌లోకి తాజాగా స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా ఎంట్రీ ఇచ్చింది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఇప్పటికే అభిమానులను అలరిస్తూ ఉండే శ్రీముఖి.. ఇప్పుడు యేషనాగుల కట్టమీద పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
