Skipping: అధిక బరువుతో చాలామంది బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గేందుకు చాలా రకాల వ్యాయమాలు చేస్తారు. కానీ వేగంగా బరువు తగ్గాలంటే ఏది ఉత్తమమైన వ్యాయామమో చాలా మందికి తెలియదు. ఒక్కో రకమైన ఎక్సర్సైజ్ ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. కానీ అన్ని రకాల శరీరతత్వాలకు అత్యుత్తమంగా పనిచేసే వ్యాయామం స్కిప్పింగ్. (Skipping)
చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. ఎక్సర్సైజ్ చేయడంతో పాటు అది ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి. చాలామంది నిపుణులు చెప్పేదేంటంటే స్కిప్పింగ్ అనేది అందరికీ అందుబాటులో ఉన్న అద్భుతమైన వ్యాయామం. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. జిమ్ లకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఒక రోప్, షూ ఉంటే చాలు. స్కిప్పింగ్ వల్ల క్యాలరీలు ఖర్చు అవుతాయి. అదే సమయంలో కండరాలు కూడా పటిష్టపడతాయి. కాళ్లు చేతులతో పాటు పూర్తి శరీరం కదలడం వల్ల శరీరాకృతి కూడా మంచిగా తయారవుతుంది.
శరీర భాగాల వేగవంతమైన కదలికల వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఆటోమెటిగ్గా శరీర బరువు తగ్గుతుంది. భుజాలపై పేర్కొన్న కొవ్వు కూడా కరుగుతుంది. శరీర భాగాల్లో కొవ్వు కరగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
గుండె జబ్బులు దూరం
శరీరం తగ్గడంతో పాటు గుండె కండరాలను స్కిప్పింగ్ స్ట్రాంగ్ చేస్తుంది. స్కిప్పింగ్ లో జంపింగ్ వల్ల హార్ట్ బీట్ రేట్, బ్రీతింగ్ రేట్ పెరుగుతాయి. ఆ సమయంలో గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సాఫీగా సాగుతుంది. స్కిప్పింగ్ లో శరీరంలోని అన్ని భాగాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి కాళ్లు, చేతులు, ఇతర భాగాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది.
ఏ విధమైన ఎక్సర్సైజ్ చేసినా… శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. స్కిప్పింగ్ ద్వారా అది మరింత ఎక్కువగా అవుతుంది. డోపమైన్ రిలీజ్ ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. స్కిప్పింగ్ లో పైకి కిందకు ఎగరడం వల్ల తాత్కాలికంగా ఎముకలపై ఒత్తిడి పడుతుంది. కానీ అది దీర్ఘకాలికంగా ఎముకలను పటిష్టం చేస్తుంది.
Read Also : Karthika masam: మీకు తెలుసా? కార్తీక మాసం శుక్రవారం నాడు ఇలా చేస్తే ధనవంతులవుతారట..!