చాలా మంది అధిక బరువుతో (Weight Loss Drinks) బాధపడుతుంటారు. ఆహార అలవాట్లు, అధికంగా నిద్రపోవడం, సరైన డైట్ లేకపోవడం లాంటి కారణాలతో అధిక బరువు పెరుగుతుంటారు. అయితే, వెయిట్ పెరిగినంత ఈజీగా తగ్గడం సాధ్యం కాదు. దురలవాట్లు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. వెయిట్ తగ్గించుకోవాలంటే కఠినమైన వ్యాయామాలు చేయనవసరం లేకుండానే కొన్ని రకాల డ్రింక్స్ (Weight Loss Drinks) తాగడం ఉత్తమం.
1. చెడు అలవాట్ల కారణంగా శరీరం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. అధిక బరువు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. దీంతో శరీర ఆకృతి అంద విహీనంగా తయారవుతుంది.
2. చాలా మంది పెరిగిన కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక తంటాలు పడుతుంటారు. ఉదయం, సాయంత్రం పరుగులు తీయడం, జిమ్ లో కసరత్తులు చేయడం లాంటివి చేస్తుంటారు.
3. అయితే, అందరికీ జిమ్ లో విన్యాసాలు చేయడం, రన్నింగ్ లాంటివి సాధ్యం కావు. పట్టణాల్లో ఉండే వారికి కుదరదు. అలాంటప్పుడు కొన్ని ఈజీ టిప్స్ పాటిస్తే సులభంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
4. ముఖ్యంగా కొన్ని పానీయాలు తీసుకోవాలి. ఇలాంటి వాటిలో గ్రీన్ టీ ముఖ్యమైనది. పాలు, చక్కెర, టీకి మంచి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ నిలుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ పుచ్చుకుంటే అధిక బరువు తగ్గవచ్చు.
5. నిమ్మరసం కూడా బరువును తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి తాగితే కొన్ని వారాల్లోనే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది.
6. అలాగే వాము వాటర్ కూడా బరువు తగ్గడానికి బెస్ట్ ఔషధం. చాలా మంది ఇళ్లలో వాము వాటర్ స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. ఓ గ్లాసు నీటిలో వాము వేసి రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచిది.
7. సోంపూ కూడా బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోసిస్తుంది. భోజనం తర్వాత కాస్త నోట్లో వేసుకొని నములుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే బరువు తగ్గుతారు.
నెయ్యితో ఇలా చేస్తే.. జీర్ణ వ్యవస్థ సెట్..
1. నెయ్యితో లాభాలు అనేకం. మన పూర్వీకుల నుంచి నెయ్యిని వాడుతూ వస్తున్నారు.
2. ముఖ్యంగా మనం తయారు చేసుకున్న నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్యాకెట్లలో దొరికే వాటికన్నా ఇంటినెయ్యి వాడటం అన్ని రకాలుగా క్షేమదాయకం.
3. చాలా మంది నెయ్యి తింటే లావైపోతామని భయపడుతుంటారు. అలాగే కొవ్వు పెరుగుతుందని అపోహ పడుతుంటారు.
4. కానీ, దేశీ నెయ్యి వాడితే అలాంటి ప్రమాదాలేవీ ఉండవు. దేశీ నెయ్యి వాడటం వల్ల మన శరీరం ఫిట్ గా తయారవుతుంది. ఇందులో మన శరీరానికి హాని కలిగించే చక్కెర ఉండదు.
5. విటమిన్ కే, ఈ, ఏ పుష్కలంగా దొరుకుతాయి. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
6. దేశీ నెయ్యిని తరచూ మనం ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
7. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సెట్ చేసే శక్తి ఈ నెయ్యికి ఉంది. దేశీ నెయ్యితో పేగుల పనితీరు మెరుగుపడుతుంది. కడుపులో అల్సర్, క్యాన్సర్ లాంటి కణాలను తొలగిస్తుంది. చాలా విటమిన్లు ఉండటం వల్ల శరీరానికి అన్ని రకాలా ఉపయోగపడుతుంది.
8. దేశీ నెయ్యిలో అనేక విటమిన్లు దాగుంటాయి. జట్టు రాలడం అనే సమస్య ఉన్న వారికి నెయ్యి తీసుకుంటే రాలడం తగ్గుతుంది. జుట్టును బలోపేతం చేస్తుంది.
9. చుండ్రు, దురద లాంటి సమస్యలనూ నివారిస్తుంది. దంత సమస్యలనూ దూరం చేస్తుంది. చిగుళ్లు పటిష్టంగా తయారవుతాయి. ఆకలి, నిద్ర సమస్యలను దూరం చేస్తుంది.
10. చిన్నారులు, పెద్దలు అందరూ దేశీ నెయ్యి వాడటం వల్ల ఆకలి పెరిగి, అజీర్తి సమస్య తొలగుతుంది. ముఖ్యంగా నిద్ర లేమితో బాధ పడే వారు రోజూ కాసింత నెయ్యి అన్నంలో కలుపుకొని తింటే మంచి ఫలితాలు చూడవచ్చు.
Read Also : Acidity Control: ఎసిడిటీని కంట్రోల్ చేయడం ఎలా?