Arjuna: భారతంలో అనేక విశేషమైన పేర్లు ఉన్నాయి. ఈ ఘట్టంలో కొందరికి ఒకటికంటే అధిక సంఖ్యలో పేర్లుంటాయి. ఉదాహరణకు భీష్ముడికి అనేక పేర్లు ఉన్నాయి. అర్జునుడికి మాత్రం 10 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లను భూలోకంలో ఎవరు ఎక్కడ తలచుకున్నా ఉరుములు, మెరుపులు, పిడుగుల నుంచి రక్షణ పొందుతారని పురాణాల నుంచే చెబుతూ వస్తున్నారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి.. ఇలా తలచుకుంటూ ఉంటాం. Arjuna
ఇది ఈ తరం వారికి చాలా మందికి తెలియని విషయం. పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్న సందర్భంగా ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడు కౌరవులతో యుద్ధానికి సిద్ధం అవుతాడు. జమ్మిచెట్టు మీద ఉంచిన బాణాలు తీసుకొనే సమయంలో తాను అర్జునుడినే అనే నమ్మకం ఉత్తర కుమారుడికి కలిగించే ప్రయత్నంలో అతడు పాండవ మధ్యముడి పది పేర్లు చెప్పమంటే అర్జునుడే స్వయంగా తన పది పేర్లు చెబుతాడు. ఆ పది పేర్ల వెనుక ఉన్న ఆంతర్యం, సార్థకం కూడా వివరించాడు. ఆ పది పేర్లు ఇవీ..
1. అర్జునుడు
2. ఫల్గునుడు
3. పార్థుడు
4. కిరీటి
5. శ్వేతవాహనుడు
6. బీభత్సుడు
7. విజయుడు
8. జిష్ణుడు
9. సవ్యసాచి
10. ధనంజయుడు
అర్జున
అర్జున అంటే తెలుపు రంగు అని అర్థం. అర్జునుడి మేని ఛాయ తెలుపు. అది నిర్మల వర్ణమని చెబుతారు. మొత్తం భూమిలో తన వర్ణంతో సమానమైన వర్ణం దుర్లభమని, తాను స్వచ్ఛమైన పని చేస్తానని, అందుకే తనను అర్జునుడంటారని భారతంలో అతడు ఉత్తర కుమారుడితో స్వయంగా చెబుతాడు.
ఫల్గుణ
అర్జునుడు పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధి కాలంలో జనియించడం వల్ల ఫల్గునుడయ్యాడు.
పార్థ
కుంతీదేవికి పృథ అనే నామం కూడా ఉంది. ఆమె కుమారుల్లో చివరివాడైన అర్జునుడికి ఈ కారణంగా పార్థుడు అనే నామం వచ్చింది.
కిరీటి
ఇంద్ర దేవుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి కిరీటం బహూకరించాడన్నది వినే ఉంటాం. ఈ కిరీటం యుద్ధంలో అతడి శిరస్సు మీద ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. ఆ కిరీటం అభేద్యం, సుస్థిరమైనదిగా పురాణం స్పష్టం చేస్తోంది. అందుకే అర్జునుడికి కిరీటి అని పేరుంది.
శ్వేతవాహన
యుద్ధ రంగంలో ఉన్నప్పుడు అర్జునుడు ఎల్లప్పుడూ తన రథానికి అనివార్యంగా, నియమంగా తెల్లటి గుర్రాలనే కడతాడు. అందుకే శ్వేతవాహనుడని పేరు వచ్చింది.
బీభత్స
బీభత్సం అంటే ప్రేక్షకులకు ఒళ్లు జలధరించేలా చేసే పరిస్థితి. యుద్ధం చేస్తున్న సమయంలో శత్రుసైన్యాల్ని అర్జునుడు ఇదే రకంగా చేస్తాడు. అంటే కదనరంగాన బెబ్బులిలా మారి బీభత్సం సృష్టిస్తాడు. శత్రువుల్ని చీల్చి చెండాడినప్పుడు అలాంటి దృశ్యాలు బీభత్సంగా ఉంటాయి కాబట్టి అర్జునుడికి బీభత్సుడనే పేరు కలదు.
విజయుడు
యుద్ధ రంగంలో ఎంతటి బలవంతులనైనా తునుమాడుతూ ఓడించగల పరాక్రమం అర్జునుడి సొంతం. అందుకే ఎంతటి వీరోచితులు పోరాడినా, ఎదిరించినా యుద్ధంలో విజయాన్ని సాధించగల ధీరోదాత్తుడు అర్జునుడు. కాబట్టి అందరూ అర్జునుడిని విజయుడు అని పిలుస్తారు.
సవ్యసాచి
అర్జునుడు చూస్తుండగా యుద్ధంలో ఎవరైనా ధర్మరాజు దేహానికి గాయం కలిగిస్తే వాళ్లను హతమారుస్తాడు. అందుకే తాను జిష్ణుడనని అర్జునుడు మహాభారతంలో చెబుతాడు. యుద్ధరంగంలో ఏ చేతితోనైనా అల్లెతాటిని అవలీలగా లాగే సామర్థ్యం అర్జునుడి సొంతం. కానీ ఆ లాగడంలో ఎడమచేతి వాటం అతి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సవ్యసాచిగా అర్జునుడిని పిలుస్తాం.
ధనంజయుడు
భూమి అంతటినీ జయించి ఓడిపోయిన రాజుల నుంచి అపార ధన సంపద పొందిన వాడు అర్జునుడు. అందువల్ల ధనంజయుడిగా పేరు గాంచాడు.
ఇవీ చదవండి: Mangalsutra: తాళిబొట్టు ఇతరులకు కనిపించకుండా ధరించాలా? పురాణాలు ఏం చెబుతున్నాయి?
Dharma Raju: జూదంలో భార్యని ఓడిన ధర్మరాజు.. ధర్మానికి ప్రతీక ఎలా అవుతాడు?
Goddess Lakshmi: కలలోకి ఈ వస్తువులు వస్తే.. లక్ష్మీదేవిత తలుపు తట్టినట్లే..!
Gokarna temple: గోకర్ణ క్షేత్రం గొప్పతనం ఇదీ.. మోక్షాన్ని పొందడానికి మార్గం.. తప్పక తెలుసుకోండి
Mattelu: కాలి మట్టెలు, తాళిబొట్టు ఎందుకు ధరిస్తారు? హిందూ ధర్మం ప్రకారం వీటి విశిష్టత ఏంటంటే..
