HomeAstrologyBhagavad Gita in audio: ఆడియో రూపంలో భగవద్గీత.. మరో ప్రయోగానికి సిద్ధమైన ఆర్పీ పట్నాయక్

Bhagavad Gita in audio: ఆడియో రూపంలో భగవద్గీత.. మరో ప్రయోగానికి సిద్ధమైన ఆర్పీ పట్నాయక్

Bhagavad Gita in audio: ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, సింగర్‌ ఆర్పీ పట్నాయక్‌ నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. అందులో భాగంగా తాజాగా అద్భుత ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో అద్భుతమైన పాటలే కాకుండా, నటనాపరంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌. హిందువులు ‘భగవద్గీత’ను అమితంగా ఇష్టపడతారు. Bhagavad Gita in audio

భగవద్గీత పేరు చెబితే తెలుగు వారికి ఘంటసాల గానం చేసినదే గుర్తుకొస్తుంది. భౌతికంగా మన మధ్య ఘంటసాల లేకపోయినా ‘భగవద్గీత’ రూపంలో ఆయన గొంతు అజరామరంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే గీతను నేటి యువత కోసం అందించడానికి ఆర్పీ పట్నాయక్‌ రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

ప్రస్తుతం కంప్యూటర్‌ యుగంలో తేలిపోతున్న యువతకు సరైన దిశానిర్దేశం, మార్గనిర్దేశం చేసేందుకు ఇదొక అద్భుతమైన ప్రయోగం అని చెబుతున్నారు. తత్వజ్ఞానం, జీవనమార్గం చూపించే శాస్త్రం భగవద్గీతకు మించి ఇంకెక్కడా దొరకదని పెద్దలు చెబుతారు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం (సంస్కృత శ్లోకాలు లేకుండా) నేటి యువత కోసం రికార్డ్ చేసినట్లు ఆర్పీ పట్నాయక్‌ తెలిపారు.

పూర్తి వివరాలతో త్వరలోనే వస్తాననంటూ ఆర్పీ పట్నాయక్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. ఆర్పీ పట్నాయక్‌ తీసుకురాబోయే గీతాసారం ఆయనే స్వయంగా స్వరపరిచారా? లేక వేరెవరితోనైనా చెప్పించారా? అనేతి తెలియాల్సి ఉంది. సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడు, నటుడు, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్‌ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ చరిత్రాత్మక ప్రాజెక్టు ప్రజల్లోకి వెళ్తే రెస్పాన్స్‌ ఎలా వస్తుందన్నది వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: Sirimanothsavam: వైభవోపేతం.. సిరిమానోత్స‌వం.. అంబరాన్ని తాకిన భక్తుల సంబరం
Puja vidhanam: హిందూ ధర్మం ప్రకారం పూజా విధానాలు.. ఎలాంటి పద్ధతులు అనుసరించాలంటే..
Gods Photos: పూజ గదిలో ఏ దేవుళ్ల ఫొటోలు పెట్టుకోవాలి.. పెద్దలు ఏం చెప్పారు?
Peepal Tree: రావిచెట్టుకు ఏ రోజు పూజ చేయాలి? ఇలాంటి రోజుల్లో తాకితే నష్టమా?
God Shani: శనైశ్చరుని ఎలా పూజించాలి? నియమాలు తెలుసా? తప్పక తెలుసుకోండి..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు