Gods Photos: పూజ గదిలో, ఇంటి గుమ్మానికి, దిష్టి కోసం పెట్టే ఫొటోలు, విగ్రహాలు.. ఇలా చాలా రకాలుగా ఇళ్లలో పెట్టుకుంటుంటారు. ఈవిషయంపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. ఇంట్లో సూర్య భగవానుడి ఫొటోను ఉంచుకోరాదట. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కారం చేసుకోవాలి. పూజగది విడిగా లేనట్లయితే పంచముఖ ఆంజనేయుడి ఫొటోను ఇంట్లో పెట్టకూడదని చెబుతున్నారు. అలాగే ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫొటోను, విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదట. (Gods Photos)
సాధారణంగా పూజ గదిలో అనేక దేవతా మూర్తుల చిత్రపటాలు ఉంచుకోవడం హిందూ సంప్రదాయం ప్రకారం ఆచారం. తమ ఇష్టదైవం, కులదైవం, గ్రామ దేవత, ఇలా అనేక రకాల దేవుళ్లకు చెందిన చిత్రపటాలు ఉంచుకొని పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అయితే, చాలా మందికి పూజ గదిలో ఏ దేవుని ఫొటోలు పెట్టుకోవాలి? ఏవి ఉంచరాదనే సందేహాలు కలుగుతుంటాయి. వీటన్నింటికీ సమాధానాలను నిపుణులు చెబుతున్నారు.
నరసింహ స్వామి వారి యోగనరసింహ, ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫొటోలు ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదట. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫొటో గానీ, చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం గానీ ఇంట్లో ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే లక్ష్మీ దేవి విగ్రహం ముందు లేదా ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచితే శుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
కాళికాదేవి రూపం అసలే వద్దు..
అమ్మవారి రూపం కాళికా దేవి, ప్రత్యంగిరా దేవి ఫోటోలు ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు విగ్రహాలు చిన్నసైజులో ఉండేలా చూసుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహానికి పెట్టుకోకూడదట. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు. ఇలాంటి ఫొటోలు పెడితే ఇంటి యజమానికి తరచూ అనారోగ్యానికి గురవుతారని నిపుణులు సూచిస్తున్నారు. వినాయకుడి ఫొటో లేదా దిష్టి యంత్రం ఫొటో పెట్టుకుంటే మంచిదట.
ఇదీ చదవండి: Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి? అసలు, నకిలీ ఎలా గుర్తించాలి?