HomeInternationalForeign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్‌!

Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్‌!

Foreign Education: విదేశాల్లో చదవాలని చాలా మంది కల కంటుంటారు. అయితే, అందుకు సరిపడా వనరులు సమకూర్చుకోవడం ముఖ్యం. డబ్బు, ఆలోచన విధానం, చదవగల సామర్థ్యం ఉన్నప్పటికీ విదేశాల్లో ఉండే సౌకర్యాలు, వసతులు, ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తీరా అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడే బదులుగా ముందే అన్నీ ఆలోచించి, వాకబు చేసి విదేశాలకు విద్యనభ్యసించేందుకు వెళ్లాలి. ఇందులో భాగంగా ఏయే దేశాల్లో విద్యా విధానం టఫ్‌గా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం. ముందే జాగ్రత్త పడేలా ఈ కథనం. Foreign Education

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ కష్టంగా ఉంటుంది. ఒక్కో దేశంలో వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి విద్యా విధానం ఉంటాయి. కొన్ని దేశాల్లో విద్యా విధానం చాలా ఈజీగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఉన్నత చదువుల కోసం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లే ముందే అక్కడి విద్యా విధానం గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా టఫెస్ట్ విద్యా విధానం ఉన్నదేశాలు ఏంటన్నది ముందే తెలుసుకోవాలి.

రష్యా దేశంలో చదువులెలా ఉంటాయి?

ఇదీ చదవండి: American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు

రష్యాలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు యూనిఫైడ్ స్టేట్ ఎగ్జామ్ తప్పనిసరి. ఇక్కడ 55.4% విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారని స్పష్టమవుతోంది. ఈ మేరకు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బిజినెస్‌, ఫైనాన్స్, ఇంజినీరింగ్, ఏరియా స్టడీస్ కోర్సులు ఎక్కువగా అభ్యసిస్తున్నారు. రష్యా సగటు IQ 96. మాస్కో స్టేట్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు 12 శాతం యాక్సెప్టెన్స్‌ రేషియోని ఉన్నాయని తేలింది.

సౌతాఫ్రికాలో ఎలా ఉంటుందంటే..

దక్షిణాఫ్రికా విద్యా విధానంలో 12 సంవత్సరాల అధికారిక విద్య తర్వాత ఎన్‌ఎస్‌సీ పరీక్షలు ఉంటాయి. దేశంలో 58.2 శాతం విద్యార్థినులు, 41.8 శాతం విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొంటారని చెబుతున్నారు. బిజినెస్‌, ఎకనామిక్స్‌, హెల్త్‌ సంబంధిత కోర్సులు ఎక్కువ మంది సెలెక్ట్‌ చేసుకుంటారని తేలింది. దక్షిణాఫ్రికా సగటు ఐక్యూ 69. కేప్ టౌన్ విశ్వవిద్యాలయం సుమారు 50 శాతం యాక్సెప్టెన్స్‌ రేటును కలిగి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అమెరికాలో విద్యా విధానం ఎలా ఉంటుంది?

యునైటెడ్ స్టేట్స్ కే-12-4 విద్యా విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో 13 ఏళ్ల అధికారిక విద్య ఉంటుంది. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం జీఆర్ఈ నిర్వహిస్తుంది. 67 శాతం అమెరికన్ విద్యార్థులు ఒత్తిడితో చదువులు చదువుతున్నారు. బిజినెస్‌, హెల్త్, సోషల్‌ సైన్సెస్‌, ప్రముఖ కోర్సులు. యునైటెడ్ స్టేట్స్‌లో సగటు ఐక్యూ 98. హార్వర్డ్ విశ్వవిద్యాలయం 4 శాతం అత్యంత ఎక్కువ అడ్మిషన్ల రేటుతో ఉంది.

సింగపూర్‌లో ఎలా ఉందంటే..

సింగపూర్‌ విద్యా వ్యవస్థలో ప్రాథమిక, మాధ్యమిక, పోస్ట్ సెకండరీ విద్య వంటి దశలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సింగపూర్-కేంబ్రిడ్జ్ GCE A-స్థాయి పరీక్ష చాలా క్లిష్టతరంగా ఉంటుందట. సక్సెస్‌ రేటు కూడా ఎక్కువే. 16 నుంచి 24 ఏళ్లు వయసున్న విద్యార్థుల్లో 63 శాతం మంది ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తేలింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, హెల్త్ సైన్సెస్‌ కోర్సులు అధికంగా విద్యార్థులు ఎంచుకుంటున్నారు. సింగపూర్ సగటు ఐక్యూ స్కోర్ 105.9. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌నకు సుమారు 16 శాతం అప్లికేషన్లు అందుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

దక్షిణ కొరియాలో ఎలా ఉంది?

దక్షిణ కొరియా 4 ప్రధాన దశలతో నిర్మాణాత్మక విద్యా వ్యవస్థను అవలంబిస్తోంది. ప్రాథమిక పాఠశాల (6 ఏళ్లు), మాధ్యమిక పాఠశాల (3 సంవత్సరాలు), ఉన్నత పాఠశాల (3 సంవత్సరాలు), విశ్వవిద్యాలయం లేదా జూనియర్ కళాశాల (వరుసగా 4 ఏళ్లు లేదా 2-3 సంవత్సరాలు.) ఇక్కడి సునెంగ్ అనే కాలేజీ ప్రవేశ పరీక్ష, 8 గంటల నిడివి గల పరీక్ష. ఇది యూనివర్సిటీ ప్రవేశాలు, భవిష్యత్తు కెరీర్ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తోందని వెల్లడైంది. దేశంలో దాదాపు 35.6 శాతం మంది విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తేలింది. హై స్కూల్‌ విద్యార్థులు రోజుకు సగటున 16 గంటలు చదువుతున్నారట. దేశం సగటు ఐక్యూ ఏకంగా 106గా ఉందంటే ఇక్కడ విద్యా విధానం ఎంత టఫ్‌గా, ఎంత నిర్మాణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హాంకాంగ్‌

ఇక హాంకాంగ్‌ దేశంలో విద్యా విధానం విషయానికి వస్తే.. హాంకాంగ్‌ విద్యా విధానంలో ప్రాథమిక, జూనియర్, సీనియర్ సెకండరీ, తృతీయ విద్యా దశలు అమలు చేస్తున్నారు. HKDSE ఎగ్జామ్‌ చైనీస్, ఇంగ్లీషులో అత్యంత కఠినమైన పరీక్షగా చెబుతున్నారు. విద్యార్థులు దాదాపు 48.6 శాతం ఒత్తిడితో బాధపడుతున్నారు. ఆర్కిటెక్చర్, కామర్స్, బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ వంటి కోర్సులు ప్రముఖంగా ఉన్నాయి. హాంకాంగ్‌ సగటు ఐక్యూ 107. హాంకాంగ్ విశ్వవిద్యాలయం సుమారు 37 శాతం యాక్సెప్టెన్స్‌ రేషియోని ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫిన్లాండ్

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన, హ్యాపీయెస్ట్‌ కంట్రీగా పేరు గాంచిన ఫిన్లాండ్‌ 9 సంవత్సరాల పాటు నిర్బంధ విద్యతో 9-3-3 విద్యా వ్యవస్థను అమలు చేస్తోంది. ఉన్నత మాధ్యమిక, ఉన్నత విద్య దశలు ఇక్కడ అనుసరిస్తున్నారు. ఫిన్నిష్ మెట్రిక్యులేషన్ పరీక్ష ఉన్నత పాఠశాల చివరిలో విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలను పరీక్షిస్తారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలను చెప్పుకొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. 40 శాతం మంది విద్యార్థినులు, 28 శాతం విద్యార్థులు ఎడ్యుకేషన్ పరంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారని వెల్లడైంది. ఇక్కడి ఐటీ, ఇంటర్నేషనల్ బిజినెస్ లాజిస్టిక్స్ కోర్సులు పేరు గాంచాయి. ఫిన్లాండ్ సగటు 101.2గా ఉంది. హెల్సింకి వర్సిటీ యాక్సెప్టెన్స్‌ రేషియో 17 శాతంగా ఉంది.

తైవాన్

తైవాన్‌ నిర్వహించే GSAT పరీక్ష, ఉన్నత పాఠశాల విద్యార్థుల కాలేజీ ప్రిపరేషన్‌ను అంచనా వేస్తుంది. పాఠశాల సంబంధిత సమస్యలు, విద్యా పరీక్షలు 56.7 శాతం విద్యార్థుల్లో ఒత్తిడిని ఏర్పరస్తున్నాయని చెబుతున్నారు. ఇంజనీరింగ్, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని తేలింది. తైవాన్ సగటు ఐక్యూ 106.5. తైపీ విశ్వవిద్యాలయం 50 శాతం ప్రవేశ రేటును నమోదు చేస్తోంది.

చైనా

చైనా విద్యా వ్యవస్థలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా దశలు అమలులో ఉన్నాయి. చైనా జాతీయ కళాశాల ప్రవేశ పరీక్ష గావోకావోకి విద్యార్థులను రెడీ చేయడంలో దోహదపడతాయి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గావోకావో కీలకమైన ఎగ్జామ్‌గా భావిస్తారు. చైనాలో దాదాపు 67.50 శాతం మంది కళాశాల విద్యార్థులు పరిమితమైన, ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. క్లినికల్ మెడిసిన్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు ఎక్కువ మంది చదువుతున్నారు. చైనా సగటు ఐక్యూ 104.10. పెకింగ్ విశ్వవిద్యాలయం స్థానికంగా 1 శాతం యాక్సెప్టెన్స్‌ రేషియోతో ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల నుంచి 15 శాతం దరఖాస్తులు ఈ విశ్వవిద్యాలయానికి వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

జపాన్

జపాన్‌ దేశంలో 9 సంవత్సరాల నిర్బంధ విద్య, తరువాత ఉన్నత మాధ్యమిక పాఠశాల విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రవేశాల కోసం నేషనల్ సెంటర్ పరీక్ష పెడుతుంది. దేశంలో 84 శాతం మంది విద్యార్థులు, 95.1 శాతం విద్యార్థినులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట. ఎకనామిక్స్, బిజినెస్, సైన్స్, టెక్నాలజీ కోర్సులు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. జపాన్ సగటు ఐక్యూ 106.5. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం పోటీ అధికంగా ఉంటుంది. సాధారణంగా 5 శాతం నుంచి 30 శాతం వరకు ఇది ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్‌ రూపొందించిన ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం
IB SCERT: డబ్బున్నోళ్ల పిల్లల మాదిరే గవర్నమెంట్‌ బడుల పిల్లలకూ విద్యాబోధన.. ఏపీ సర్కార్‌ కీలక అడుగులు
Pradyumna IAS: విద్యతోపాటు క్రీడలపైనా విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి: ఐఏఎస్‌ ప్రద్యుమ్న
Tableaux Wins Third Prize: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి.. ఆకట్టుకున్న డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు