God Shani: ప్రతి మనిషి జీవితంలోనూ 30 ఏళ్లకోసారి ఏడున్నర సంవత్సరాల పాటు జాతక చక్రం ప్రకారం ఏలిన నాటి శని ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ సమయంలో కొందరి జీవితాలు పూర్తిగా తలకిందులవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో అనేక మంది భయపడిపోతూ ఉంటారు. అయితే, నిజానికి శనైశ్చరుడు సాక్షాత్తూ సూర్య భగవానుడి తనయుడు కాబట్టి.. మానవాళికి అజ్ఞానాంధకారాలు తొలగించి మంచి ప్రవర్తన కలిగి ఉండేలా చేసేందుకు ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అనేక పరీక్షలు పెడుతుంటాడని జ్యోతిష్య నిపుణులు (Astrology) చెబుతారు.
వాస్తు శాస్త్రంలో (Vastu Sastra) అనేక నియమాలను పండితులు సూచించారు. వాటిని పాటించడం ద్వారా నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను సులువైన పరిష్కారం పొందవచ్చు. ఈ క్రమంలో పూజా మందిరం విషయంలోనూ వాస్తు శాస్త్రం పరంగా అనేక అంశాలను పాటించవచ్చు. ముఖ్యంగా శనైశ్చరుడి (God Shani) పేరు చెబితేనే చాలా మంది భయపడిపోతుంటారు.
శనిదేవుడిని నిష్టతో పూజించడం వల్ల వారిపై శని ప్రభావం తగ్గి జీవితం కాస్త సాఫీగా జరిగిపోయే వీలుంటుంది. ఈ నేపథ్యంలో శని దేవుడిని పూజించే వాళ్లు ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకోవాలి. పాటించకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో గమనించాలి. శని దేవుని పూజ చేసే సమయంలో ఒంటిపై ధరించే దుస్తుల రంగుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
శనిదేవుని పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులు వేసుకోరాదు. ఆయనకు ఇష్టమైన నీలం, నలుపు రంగు దుస్తులు ధరించాలి. శని దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్ను చూపకూడదు. శని దేవుడిని పూజించేటప్పుడు ఎదురుగా నిల్చొని ఉండరాదు. శని దేవుని పూజ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లినా నిలబడి ఉన్న స్థానం నుంచి అలాగే వెనక్కు వెళ్లిపోవాలి. పూజ సమయంలో శని దేవుడి కళ్లలోకి చూడకూడదు. శనిని పూజించే సమయంలో కళ్లు మూసుకుని ఉండాలి. లేదంటే ఆయన పాదాల వైపు చూస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది బెంబేలెత్తుతారు. శని పాపాలకు తగిన దండన విధిస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఏలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశ కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు చాలానే ఉన్నాయని వాస్తు పండితులు భరోసా ఇస్తున్నారు.
ఏయే రాశుల వారికి ఎఫెక్ట్…?
శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి, మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడంతో పాటు సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుందని నిపుణులు చెబుతారు. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడవుతాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంత మంచి కూడా జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుందని పెద్దలు చెబుతారు. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడని, కాబట్టి భయపడాల్సిన పనే లేదని నిపుణులు అంటున్నారు.
Read Also : Money Tips in Astrology: అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?