HomeAndhra PradeshMedical Recruitment AP: 185 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టుల పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్‌

Medical Recruitment AP: 185 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టుల పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్‌

Medical Recruitment AP: సెకండ‌రీ హెల్త్ డైరెక్టరేట్ ప‌రిధిలో 185 మంది సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల నియామ‌కానికి ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబ‌ర్ సెక్ర‌టరీ ఎం.శ్రీనివాస‌రావు తెలిపారు. Medical Recruitment AP

ఈనెల 21, 23, 26 తేదీల్లో నిర్వ‌హించాల‌నుకున్న వాకిన్ రిక్రూట్మెంట్ కు బ‌దులు ఈనెల 28, మార్చ్ 1 తేదీల్లో నిర్వ‌హిస్తామ‌ని, అనివార్య కార‌ణాల‌వ‌ల్ల వాకిన్ రిక్రూట్మెంట్ తేదీల్ని రీషెడ్యూల్ చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రెగ్యుల‌ర్‌, కాంట్రాక్ట్‌, కొటేషన్ ప‌ద్ధ‌తిలో పోస్టుల్ని భ‌ర్తీ చేస్తామన్నారు.

ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు డైరెక్ట‌రేట్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్ , 77-2|జి, ల‌క్ష్మి ఎలైట్ బిల్డింగ్‌, పాతూర్ రోడ్‌, తాడేప‌ల్లి, గుంటూరు జిల్లా చిరునామాలో నిర్వ‌హించే వాకిన్ రిక్రూట్మెంట్ కు అర్హ‌త గ‌ల అభ్య‌ర్థ‌లు స్వ‌యంగా హాజ‌రుకావాల‌ని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ‌లో ఎప్పుడు ఏర్ప‌డిన ఖాళీలను అప్పుడే భ‌ర్తీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ వైఎయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు నిరంత‌ర నియామ‌క ప్ర‌క్రియను కొనసాగిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

జ‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, డెర్మ‌టాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, రేడియాల‌జీ, ఫొరెన్సిక్ మెడిసిన్ విభాగాల‌కు ఈనెల 28న‌, గైన‌కాల‌జీ, పిడియాట్రిక్స్‌, ఎన‌స్థీసియా, ఇఎన్ టి, అప్తాల్మ‌లాజీ, ప‌థాల‌జీ విభాగాల‌కు మార్చ్ ఒక‌టో తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంద‌ని పేర్కొన్నారు.
పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/ మరియు https://hmfw.ap.gov.in వెబ్సైట్లను చూడొచ్చని శ్రీనివాసరావు తెలిపారు.

Read Also: Jawahar Reddy on employees: మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని స్ట్రీమ్ లైన్ చెస్తాం: సీఎస్‌ జవహర్‌రెడ్డి
CS Review on NREGA: ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు చర్యలు
AP Industrial growth: ఏపీలో పరిశ్రమలు పారిపోతున్నాయా? ఒక్కసారి ఇటు చూసి నిజాలు తెలుసుకోండి..
Tribal welfare AP: అడవిబిడ్డల చింత తీర్చిన జగన్ పాలన.. గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం
YS Jagan about Develepment: అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసిన చరిత్ర మనది.. సిద్ధం సభలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు