Jawahar Reddy on employees: రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయడంతో పాటు మెడికల్ రీయింబర్సుమెంట్ విధానాన్నిమరింత స్ట్రీమ్ లైన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)పై స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి వివిధ అంశాలను ఆయన విస్తృతంగా చర్చించారు. (Jawahar Reddy on employees)
మెడికల్ రీ యింబర్సుమెంట్ విధానాన్నిమరింత పటిష్టవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, దీనిపై వెంటనే తగిన కసరత్తు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆయన ఆదేశించారు. ఉద్యోగులు,ఫెన్సర్లు అందరికీ ఆరోగ్య కార్డులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పధకానికి ప్రభుత్వ వాటా నిధులు సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.
గుండె,కిడ్నీ,కేన్సర్ వంటి 10 ప్రధాన ప్రొసీజర్లకు ప్రస్తుతం ఇస్తున్న ఫ్యాకేజి రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని దానిపై కూడా తగిన ప్రతిపాదనలను సిద్దం చేసి పంపాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు. గుండె జబ్బుకు సంబంధించి రోగులకు వేసే స్టంట్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టాప్ బ్రాండ్ స్టంట్ కే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని ఆస్టంటే వేసేలా నెట్ వర్కు ఆసుపత్రులకు నిర్దేశం చేస్తామని సీఎస్ స్పష్టం చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య పధకం అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్లు వెంటనే సమావేశాలు నిర్వహించి వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు,ఫెన్సర్లు,వారి డిపెండెంట్లు కలిపి సుమారు 22 లక్షల మంది ఉన్నారని వారందరికీ హెల్తు కార్డులు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
ఉద్యోగులకు సంబంధించిన కార్డులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సుమెంట్ అధికారులకు,ఫెన్సర్లు కార్డులను సబ్ ట్రెజరీ అధికారులకు పంపేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ సీఈఓ హరీంద్ర ప్రసాద్ ఉద్యోగుల ఆరోగ్య పధకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 2013 నుండి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఈపథకంలో 2510 ఐపి ప్రొసీజర్సు కవర్ అవుతున్నాయని, అలాగే 10 కోవిడ్ ప్రొసీజర్లను కూడా దీనిలో చేర్చడం జరిగిందని చెప్పారు.
25 క్రానిక్ ఓపి ప్రొసీజర్లను కూడా దీనిలో చేర్చడం జరిగిందని,57 డెంటల్ ప్రొసీజర్లు దీనిలో కవర్ అవుతున్నాయన్నారు. లక్షా 28వేల 593 మంది గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా ఈపధకం కిందకు తీసుకువచ్చామని వివరించారు.ఉద్యోగుల ఆరోగ్య పధకం అమలులో సమస్యలుంటే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు వీలుగా 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.
Read Also : PRC Commission: ఏపీలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు.. ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఇదేశం