HomeAndhra PradeshTribal welfare AP: అడవిబిడ్డల చింత తీర్చిన జగన్ పాలన.. గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం

Tribal welfare AP: అడవిబిడ్డల చింత తీర్చిన జగన్ పాలన.. గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం

Tribal welfare AP: ఏపీలో జగన్ ప్రభుత్వం అడవిబిడ్డల చింత తీరుస్తోంది. వాలంటీర్ల ద్వారా గిరిపుత్రుల గడప వద్దకే సేవలందించడం మొదలు.. ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొనేలా గిరిపుత్రుడైన రాజన్నదొరకు అవకాశం కల్పిండం వరకు.. వారి కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. పాలనా సౌలభ్యం కోసం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం, గిరిజన యూనివర్సిటీ, ఎస్టీ కమిషన్, ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ, ఏజెన్సీ ప్రాంతాల్లో 300 సెల్ టవర్ల ఏర్పాటు.. ఇలా గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న పాలన చరిత్రలో మొట్టమొదటి సారిగా చూస్తున్నాం. (Tribal welfare AP)

పదవుల నుంచి పాలన దాకా..

* డిప్యూటీ సీఎంగా పీడిక రాజన్నదొరకు అవకాశం.
* గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 37 మండలాలతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో 2 కొత్త జిల్లాల ఏర్పాటు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు.

* కనీసం 500 జనాభా ఉన్న ప్రతి తండా/గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ, గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు.
* గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్.
* గిరిజన సంక్షేమాభివృద్ధికి రాష్ట్రస్థాయిలో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు.

ఆరోగ్యానికి పెద్దపీట

* గిరిజనుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.
* రూ.246.30 కోట్లతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం, ప్రకాశం జిల్లాలోని దోర్నాలలో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం.
* ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో 24/7 వైద్య సౌకర్యం.

* ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గిరిజనులకు వారి గ్రామంలోనే మెరుగైన వైద్యం.
* పార్వతీ పురం, పాడేరులలో రూ.1,000 కోట్లతో 2 మెడికల్ కాలేజీలు, 300 మెడికల్ సీట్లు, గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్దపీట.
* 105.32 ఎకరాల్లో రూ. 153.85 కోట్లతో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల

అన్నదాతకు ఆలంబన

* అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2 ఎకరాల భూమి.
* ఇప్పటికే 1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాల్లో అన్ని హక్కులతో కూడిన ఆర్వోఎఫ్ఆర్ పత్రాల పంపిణీ.
* 7.921 మంది గిరిజన లబ్దిదారులకు రూ.145.37 కోట్ల వైయస్సార్ బీమా పరిహారం చెల్లింపు.
* వైయస్సార్ రైతు భరోసా సాయం కింద 3,40,503 మంది ఎస్టీ రైతులకు రూ.2,089 కోట్లు

* ఇన్‌పుట్ సబ్సిడీ కింద 92,797 మందికి రూ.71 కోట్లు
* వైయస్సార్ సున్నావడ్డీ పంట రుణాల కింద 1,83,025 మందికి రూ.48.26 కోట్లు
* డా॥ వైయస్సార్ ఉచిత పంటల బీమా కింద 70.618 మందికి రూ.107 కోట్ల ఆర్థిక సాయం

సాంకేతిక విప్లవం

* గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 ఏర్పాటు.
* ప్రకాశం జిల్లాలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటు.
* ఈ సెల్ టవర్ల ఏర్పాటు ద్వారా 944 ఆవాసాలకు, 2 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం.

* చిన్నారుల భవిష్యత్ కోసం మన బడి నాడు-నేడు కింద తొలి దశలో రూ.140 కోట్లతో 352 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక వసతులు.
* రెండో దశలో రూ.103.39 కోట్లతో 358 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు.

* రూ.3,537.40 కోట్ల విలువైన 1,41,496 ఇళ్ల పట్టాల పంపిణీ.
* రూ.530.31 కోట్ల విలువైన 1,03,839 ఇళ్ల నిర్మాణం.

* ఎస్టీలకు గ్రామ, వార్డు సచివాలయాలు, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్, వాలంటీర్లు, ఆర్టీసీ, వైద్య రంగాలలో మొత్తం 41,195 ఉద్యోగాల కల్పన.
* రూ.410.11 కోట్లతో 4.58 లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జూలై, 2019 నుంచి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
* రూ.4,256 కోట్లతో 3.82,061 మంది ఎస్టీలకు గడపవద్దనే ఒక్కొక్కరికీ నెలకు రూ.3,000 పెన్షన్

ఇదీ చదవండి: 300 Cell towers: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం సేవలు.. ఏపీలో 300 సెల్‌టవర్ల ప్రారంభం
YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్‌.. బస్సు యాత్రతో వైయస్సార్‌ సీపీలో జోష్‌!!
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు