సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

CS Review on NREGA: ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు చర్యలు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 21 ఫిబ్రవరి 2024

CS Review on NREGA: ఏపీలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా పెద్దఎత్తున ఉపాధి పనులు కల్పించేందుకు ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పనిదినాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం, తాగునీరు అంశాలపై పంచాయితీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. CS Review on NREGA

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కరువు ప్రభావిత జిల్లాలు సహా ఇతర జిల్లాల్లో ఉపాధి హామీ పధకం ద్వారా పెద్దఎత్తున కూలీలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా, వైయస్సార్ కడప,అనంతపురం జిల్లాలు సహా ప్రకాశం,పల్నాడు తదిదర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని చెప్పారు.మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడ ఎక్కువ ఉపాధి పనులు నిర్వహించేందుకు అవకాశం ఉందో పరిశీలించి ఆప్రకారం షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులు రూపొందించి వేగవంతంగా పనులు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు.

అదే విధంగా గృహ నిర్మాణ లబ్దిదారులకు ఆయా గృహాలు నిర్మించుకునేందుకు ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలను కల్పిస్తున్నందున వివిధ గృహనిర్మాణాలు వేగంవంతంగా జరిగేలా గృహ నిర్మాణశాఖ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి పిఆర్ అండ్ ఆర్డి అధికారులను ఆదేశించారు.

తదుపరి గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం,రైతు భరోసా కేంద్రాలు తదితర భవనాల నిర్మాణాల ప్రగతిని సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.అనంతరం రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇంకా జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ఆశాఖ కమీషనర్ ఎ.సూర్యకుమారి,ఈఎన్‌సీలు బి.బాలూ నాయక్,ఆర్వి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: Elections in AP: సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలి.. పటిష్ట నిర్వహణపై సీఎస్‌ జవహర్‌రెడ్డి సమీక్ష
CS on CM Promises: హామీల అమలుపై సత్వరం చర్యలు తీసుకోవాలి: సీఎస్‌ జవహర్‌రెడ్డి
Jawahar Reddy on employees: మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని స్ట్రీమ్ లైన్ చెస్తాం: సీఎస్‌ జవహర్‌రెడ్డి
Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్‌ రూపొందించిన ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం
Central Funds: కేంద్ర పథకాల నిధులు సకాలంలో ఖర్చు చేయాలి.. మరిన్ని నిధులు రాబట్టండి..

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading