Raptadu Siddham: సిద్ధం సభతో రాయలసీమ దద్ధరిల్లింది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్నికలకు శ్రేణులకు సన్నాహకపర్చడంలో భాగంగా సిద్ధం బహిరంగ సభను నిర్వహించారు సీఎం జగన్. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా రాప్తాడు సభా ప్రాంగణమంతా దాదాపు 280 ఎకరాలు జనసముద్రంగా మారిపోయింది. సిద్ధం సభలో సీఎం జగన్ ఎంట్రీతో శ్రేణులు పులకించాయి. Raptadu Siddham
జనసంద్రం కనిపిస్తోంది..: సీఎం జగన్
* ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోంది. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చింది.
* ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు.
* ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది.
* ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకొనే ఎన్నికలుమాత్రమే కావు.
* ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ఈ పథకాలన్నీ కొనసాగాలని అడుగులు వేసే మనకు.. ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్‌గాపెట్టుకొని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా?
* పేదలు ఒకవైపున ఉంటే, పెత్తందార్లు మరోవైపున ఉండి ఈ యుద్ధం జరగబోతోంది.
* మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాటతప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందార్లకు మధ్యజరగబోతోంది ఈ యుద్ధం.
* ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతోంది.
* ఇలాంటి యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి తరఫున నిలబడటానికి మీరంతా కూడా సిద్ధమేనా?
* ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్‌కు, ఈ గడ్డమీదే పుట్టి, ఈ గడ్డమీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోంది.
* ఈ వేదికమీద నుంచి చంద్రబాబునాయుడు గారికి ఒక సవాల్ విసురుతున్నా. 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు.
* మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతున్నా.
* అయ్యా చంద్రబాబూ.. మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?
* చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్లే పిల్లలకైనా, కాలేజీలకు వెళ్లే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?
* పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడు అన్న పరిస్థితి అయినా ఉందా?
* చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని, మంచి పథకం తీసుకొచ్చాడని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు.
* చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా?
* ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమయినా ఉందా?
* బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా, ఆ గ్రామం మధ్యనిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ.. కనీసం ఒక్కటైనా కనిపిస్తుందా?
* ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్లయినా, హాస్పటల్స్ అయినా ఉన్నాయా?
* 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, మూడు సార్లు సీఎం అయ్యారు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా ఆ గ్రామంలో ఆగినా, ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబూ.. మీ మార్క్ ఎక్కడైనా ఉందా? అని అడుగుతున్నా.
* బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా?
* ప్రతి సామాజికవర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగు రంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజికవర్గాలన్నింటినీ మోసం చేయడం.. ఇదే ఆనవాయితీగా చంద్రబాబు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: edX MOU: ఎడెక్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకం.. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం..: సీఎం జగన్
