HomeAndhra PradeshRapthadu Siddam: నమ్మినోడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది బాబు సిద్ధాంతం: సీఎం జగన్

Rapthadu Siddam: నమ్మినోడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది బాబు సిద్ధాంతం: సీఎం జగన్

Rapthadu Siddam: రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్‌.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నేరుగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. చంద్రబాబును నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానని ఊబిలోకి దింపి మనుషుల్ని తినేసే కథే గుర్తుకొస్తుందని తెలిపారు. Rapthadu Siddam

* 1995లో చూసినా, 1999లో చూసినా, లేదా 2014లో చూసినా సీఎం అయిన ఈ పెద్దమనిషి చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టో ఇచ్చి.. ఏనాడైనా కనీసం 10 శాతం అయినా అమలు చేశారా?
* గతం ప్రజలకు గుర్తు ఉండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలు, మరొక మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబిలోకి దింపి మనుషుల్ని తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తున్నాడు.

* రంగు రంగుల మేనిఫెస్టో అంటున్నాడు. ఆరు స్కీములంటాడు. ఇంకా ఆరు రావాల్సినవి ఉంటాయంటాడు.
* నిజంగా చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదంటే.. చేసేది ఎలాగూ మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకన్నది బాబు నైజం.

* ఎలాగూ చేసేది లేదు. చెప్పేది అబద్ధాలు. చేసేది మోసమే కాబట్టి, ఇక నోటికి అడ్డు ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకున్నది బాబు నైజం.
* నమ్మిన వాడు మునుగుతాడు. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది బాబు సిద్ధాంతం.

* మూడుసార్లు సీఎం అయ్యాడు. మూడు సార్లు మేనిఫెస్టోను పెట్టాడు. ప్రతి సందర్భంలోనూ తాను చేసింది మోసం, దగా కళ్ల ఎదుటే కనిపిస్తోంది.
* చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడూ అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికీ వెళ్లి ఇక్కడున్న ప్రతి కార్యకర్త వెళ్లి చెప్పాలి.

* చంద్రబాబును, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని చెప్పాలి.
* బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలూ మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుర్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతున్నా.

* అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?
* ఈ చంద్రబాబును సవాల్‌ చేస్తున్నా. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమయినా గుర్తుకొస్తుందా?

* మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు చేయలేని పనులన్నీ దేవుడి దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరిస్తా.

* ఆ పథకాలన్నీ ఇకమీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మకు, విద్యార్థికీ, అవ్వాతాతకు, ప్రతి సామాజికవర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యత మనం తీసుకోవాలి.
* ఈ 57 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.

* ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అన్నకూ, తమ్ముడికి, రైతన్నకు చెప్పాలి.
* పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్‌ క్యాంపెయినర్‌గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని, ఆ అవసరాన్ని వైయస్సార్‌ సీపీలో ఉన్న ప్రతి కార్యకర్తా, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్‌ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించాలి.
* వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది.

* మనం చేసినవి చెప్పాలి. వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్లి చెప్పాలి.
* నేను చెబుతున్న ప్రతి మాటా జాగ్రత్తగా ఆలోచన చేసి వినాలి.

read also: YS Jagan Comments: జగన్‌ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు.. మంచి జరిగి ఉంటేనే సైనికులుగా ముందుకు రండి..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు