Swatcha Challapalli: స్వచ్ఛత, పరిశుభ్రత కోసం దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి సేవా కార్యక్రమం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. కృష్ణా, మచిలీపట్నం చర్లపల్లి తరిగోపుల ప్రాంగణంలోని డంపింగ్ యార్డ్ ఆవరణలో ఘన, ద్రవ్య వనరుల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డిపిఓ నాగేశ్వర్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉందని స్వచ్ఛ చల్లపల్లి సారథులు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతిని కృషిని అభినందించారు. (Swatcha Challapalli)
60 మంది కార్యకర్తలతో గత దశాబ్ద కాలంగా ప్రతిరోజు తెల్లవారుజామున స్వచ్ఛ కార్యకర్తలు గ్రామం కోసం పాటుపడటం ఎంతో గొప్పవిషయమని వారన్నారు. చల్లపల్లిలో వేలాది మొక్కలను నాటి పెంచటం, రోడ్లపక్కన మినీ గార్డెన్లను ఏర్పాటు చేయటం, డంపింగ్ యార్డు..స్మశానవాటికను అభివృద్ధి చేసి ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసిన తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
గ్రామాన్ని స్వచ్ఛంగా, సుందరంగా ఉంచేందుకు కృషిచేస్తున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమ వెలకట్టలేనిదన్నారు. డంపింగ్ యార్డ్ లేని గ్రామంగా చల్లపల్లి దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి గ్రామం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని అంబికాపూర్ మాదిరిగా రూపొందించాలని ఇందుకు తనవంతు సహకారం తప్పకుండా అందిస్తానని అన్నారు.డంపింగ్ యార్డ్ లేని గ్రామంగా చల్లపల్లిని తీర్చేదటానికి పూనుకోవటం చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఈ ప్రయత్నం ఫలిస్తే చల్లపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ ఆంధ్ర మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, చల్లపల్లిలో నేటివరకు నిర్వహించిన డంపింగ్ యార్డును సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి చేతుల మీదుగా మూసివేశారు. గత పదేళ్లుగా నిర్విరామంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్ పద్మావతి దంపతులను, చల్లపల్లి పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పేర్ని మాదవేంద్రరావులను అభినందించారు.. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. పర్యావరణవేత్త వేలూరు శ్రీనివాసన్ పర్యవేక్షణలో చల్లపల్లి పరిశుభ్రత కలిగిన గ్రామంగా రూపొందుతుందన్నారు.
read also: YSR Aasara: ఆడపడుచులకు కొండంత ఆసరా.. నాలుగు విడతల్లో రూ.25,571 కోట్లు అందించిన జగన్ సర్కార్
Vastu tips for House Clean: ఇంటి శుభ్రతలో వాస్తు టిప్స్ పాటిస్తే శుభప్రదం..
