YSR Aasara: వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆడపడుచులకు అందలం దక్కింది. గత ప్రభుత్వం మోసపూరితంగా హామీలిచ్చి మోసం చేయడంతో చితికిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలుగా ఆ సొమ్ము చెల్లిస్తామని ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. విశ్వసనీయతకు అసలైన అర్థం చెప్పారు. YSR Aasara
అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా.. అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, పీ&జీ, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో జగనన్న ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది.
గత ప్రభుత్వం మోసం
* పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు తామే చెల్లిస్తామని చంద్రబాబు 2014లో మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.
* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మోసపోయారు.
* అక్టోబర్ 2016 నుంచి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేయడంతో తడిసి మోపెడైన అప్పులు.
* సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని అక్క చెల్లెమ్మలే బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపంలో చెల్లించాల్సిన దుస్థితి.
* ఏ, బీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్‌లలోకి పడిపోయాయి.
* ఎన్‌పీఏలు, ఔట్ స్టాండింగ్‌లు 18.36 శాతానికి చేరాయి.
మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
* 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్‌బీసీ తుది జాబితా ప్రకారం పొదుపు సంఘాల మహిళలకు ఉన్న రూ.25,571 కోట్ల రుణాలను 4 విడతల్లో తామే ఇస్తామని జగన్ మేనిఫెస్టోలో చెప్పారు.
* మాట ఇచ్చిన ప్రకారం నాలుగు దఫాలుగా నిధులు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనే జమ చేశారు.
* వైయస్సార్ ఆసరా, వైయస్సార్ సున్నావడ్డీల ద్వారా లబ్ధి పొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి.
* నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), అవుట్ స్టాండింగ్‌లు కూడా అప్పట్లో ఉన్న 18.36 శాతం నుంచి 0.17 శాతానికి తగ్గాయి.
* జగనన్న ప్రభుత్వ సహకారంతో 14,77,568 మంది కిరాణా దుకాణాలు, ఆవులు, గెదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం లాంటివి చేపట్టి నెలకు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.
* అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.10 నుంచి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.
వైఎస్సార్ ఆసరా లబ్ధి ఇదీ..
మొదటి విడత 11 సెప్టెంబర్ 2020
లబ్ధి రూ.6,318.76 కోట్లు, లబ్ధిదారులు 77,87,295
రెండో విడత 07 అక్టోబర్ 2021
లబ్ధి రూ.6,439.52 కోట్లు, లబ్ధిదారులు 78,75,539
మూడో విడత 25 మార్చి 2023
లబ్ధి రూ.6,417.69 కోట్లు, లబ్ధిదారులు 78,94,169
నాలుగో విడత 23 జనవరి 2024
లబ్ధి రూ.6,394.83 కోట్లు, లబ్ధిదారులు 78,94,169
వైయస్సార్ ఆసరా ద్వారా మొత్తం లబ్ధి రూ.25,571 కోట్లు
వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు మాత్రమే 56 నెలల్లో జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,66,772.55 కోట్లు
YSR Asara at Kankipadu: అన్ని సంక్షేమ పథకాలనూ మహిళల పేరిటే అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్: మంత్రి జోగి రమేష్
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
