HomeAndhra PradeshMinisters on Employees: ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం

Ministers on Employees: ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం

Ministers on Employees: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు,పెండింగ్ అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వివి సత్య నారాయణ,సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్,జిఏడి అదనపు కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా వర్చువల్ గా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ పాల్గొన్నారు. Ministers on Employees (AP Cabinet)

అలాగే ఉద్యోగుల నుంచి ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి,ఎపి ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్,పిఆర్ టియు అధ్యక్షులు యం.కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు,ఎపిటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయరాజు, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెసిఆర్. సూర్యనారాయణ,ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎస్.బాలాజీ,ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు సంసాని,ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్,అదే సంఘం మరో విభాగం అధ్యక్షులు ఎస్.మల్లేశ్వరరావు తోపాటు ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాలకు మంత్రివర్గ ఉపసంఘం హామీలు ఇవీ..
* ఉద్యోగుల బకాయిలు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్స్, డీఏ అరియర్స్ మొత్తం మార్చి 31కి చెల్లిస్తామని హామీ
* ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. పోలీసుల టీఏ, డీఏలు ఎప్పుడిచ్చేది 4 రోజుల్లో చెప్తాం
* కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై 4 రోజుల్లో సమావేశం పెట్టి మా అభిప్రాయం చెప్తాం
* అధికారుల కార్లకు సంబంధించి ఏజెన్సీలకు నిధులు చెల్లించడం లేదు
* ఇకపై ఏజెన్సీల ద్వారా కార్లు తీసుకునే కంటే సొంతంగా ప్రభుత్వమే కార్లను కొనుగోలు చేస్తుంది : మంత్రి బొత్స
* 30శాతం ఐఆర్ ప్రకటించాలని మంత్రులను కోరిన ఉద్యోగ సంఘాలు
* ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి స్పందించని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం
* ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల ద్వారా వైద్యం సకాలంలో అందడం లేదని, దానిని పటిష్టం చేయాలని కోరిన ఉద్యోగ సంఘాలు
* ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్న మంత్రి బొత్స

ఇదీ చదవండి: Swatcha Challapalli: పదేళ్లుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం స్ఫూర్తిదాయకం

YSR Aasara: ఆడపడుచులకు కొండంత ఆసరా.. నాలుగు విడతల్లో రూ.25,571 కోట్లు అందించిన జగన్ సర్కార్
Tribal welfare AP: అడవిబిడ్డల చింత తీర్చిన జగన్ పాలన.. గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం
Revanth Reddy on YS Jagan: జగన్‌కు మైలేజీ పెంచుతున్న రేవంత్‌రెడ్డి.. ఏపీ ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారంటూ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు
Life partner name: మీ ఫోన్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ఎలా ఫీడ్ చేసుకున్నారు? ఇలా ప్రయత్నిస్తారా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు