మన ఇంట్లో ప్రతి రోజూ శుభ్రంగా చెత్త ఊడ్చుకోవడం, (Vastu tips for House Clean) బట్టలు ఉతుక్కోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఇంకా అనేక పనులు చేసుకుంటూ ఉంటాం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రాకుండా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, సైన్స్ పరంగా శుభ్రతకు ఎంత ప్రాముఖ్యం ఉందో వాస్తు శాస్త్రంలోనూ అంతే ప్రాధాన్యం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు.
హిందూ ధర్మం ప్రకారం పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. శుభ్రంగా ఉన్న ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహం నిలిచి ఉంటుందని చెబుతారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకోవడానికి కొన్ని ప్రత్యేక వాస్తు చిట్కాలు చెబుతున్నారు. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాస్తు నియమాల్లో చాలా చిట్కాలు సూచించారు పూర్వీకులు.
వాస్తు శాస్త్రంలో ప్రతి రోజూ క్లినింగ్ (Vastu tips for House Clean) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇల్లు శుభ్రంగా లేకుంటే దరిద్ర దేవత తాండవిస్తుందని స్పష్టం చేస్తున్నారు పండితులు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, అలాగే వాస్తు శాస్త్రంలో సూచించిన అనేక అంశాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఆనందమయ క్షణాలను గడపవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురు పట్టుకొని చెత్త ఊడ్చరాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుంది. రాత్రి సమయాల్లో చీపురుతో ఊడ్చరాదని చెబుతున్నారు. ఇంట్లోని టాయిలెట్ లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. బూజు పట్టకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. బాత్రూమ్-టాయిలెట్ పరంగా వాస్తు దోషం ఉందని భావిస్తే.. ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు పోతాయని సూచిస్తున్నారు. ఇంటికి నాలుగు మూలల్లో ఎప్పుడూ శుభ్రత పాటించాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి బాల్కనీ, లేదా పైకప్పు పై ఉపయోగించని వస్తువులను ఉంచకూడదు. విరిగిపోయిన వస్తువులను, చెత్తాచెదారాన్ని అసలే అక్కడ జమ చేయ కూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ పరి శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇల్లు ఊడ్చుకునే సమయంలో సమయపాలన కూడా ముఖ్యంగా పాటించాల్సిన అంశం.
సాయంత్రం సమయాల్లో ఇంట్లో నుంచి చెత్తను బయట పారేయకుండా ఉండటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. విరిగిపోయిన, పాడైపోయిన వస్తువులను ఇంటి పై కప్పు పై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచరాదని, ఇలాంటి పనులు అసలే చేయవద్దని సూచిస్తున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే, ఇంట్లో మహాలక్ష్మీదేవి కలకాలం ఉంటటానికి ఇష్టపడుతుందని, ఇంట్లో ఉన్న వారందరూ ఆరోగ్యంతోపాటు, ఆనందంగా జీవించేందుకు వీలవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు ఇంట్లో నాలుగు మూలలను ఎల్లప్పుడూ పరి శుభ్రంగా ఉంచుకోవాలట. ముఖ్యంగా ఉత్తరం, పడమర కోణాలను నిరంతరం ఖాళీగా, పరిశుభ్రంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం పూట ఇంట్లోని చెత్తను ఏ సందర్భాల్లోనూ బయట పడెయ్యకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నమాట. ఇలా చేస్తే ఆ చెత్తతో ఇంటి లక్ష్మి కూడా వెళ్లిపోతుందని పెద్దలు చెబుతున్నారు.
Read Also : Love sign: అబ్బాయిల ప్రేమ సంకేతాలివే.. ఇలాంటి పనులు చేస్తారు!