బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Crime News

FIR: మీపై ఎఫ్ఐఆర్ నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? 

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 23 అక్టోబర్ 2024

FIR: గ్రామాల్లో, కుటుంబాల్లో, స్నేహితులు, బంధువుల మధ్య చిన్నపాటి గొడవలు సహజం. ఇలాంటి కొన్ని సందర్భాల్లో కేసులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని రకాల కేసులు పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాక ముందే సెటిల్ చేసి పంపుతుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి శృతి మించి కోర్టుల దాకా వెళ్తుంటాయి.

ఈ నేపథ్యంలోనే పెళ్లి కావాల్సిన యువతీ యువకులు, చదువుకుంటున్న యువతపై ఈ కేసులు తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ కొలువులు ఆశించే యువతపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లయితే కొలువు దక్కుతుందా? లేదా? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉదాహరణకు ఓ యువకుడు చిన్న దొంగతనం కేసులో ఇరుక్కున్నాడడనుకుందాం. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కోర్టు పరిధిలో కేసు ఉండగానే యువకుడు తనపై ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి అతనికి కొంత నష్టపరిహారం చెల్లించాడు. అనంతరం కేసును లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయ్యాడు. ఇలా ఒక ఏడాది గడిచిన తర్వాత సదరు ఎఫ్ఐఆర్ నమోదైన యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఎస్‌బీ విచారణలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదై ఉందని తేలింది. దీంతో ఆ ఉద్యోగం అతనికి ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టేశారు.

ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ మనపై నమోదైతే సదరు ఎఫ్ఐఆర్ ను రద్దు చేయించుకోవాలి గానీ కేసును కాంప్రమైజ్ కావొద్దని న్యాయవాదులు సూచిస్తున్నారు. ఒక వేళ కేసును కాంప్రమైజ్ అయినట్లయితే దాని అర్థం.. మనం నేరం ఒప్పుకున్నట్లు అవుతుంది.

ఈ నేపథ్యంలో సివిల్ కేసుల్లో కాంప్రమైజ్ అయితే సమస్య పరిష్కారం దొరుకుతుందని, క్రిమినల్ కేసుల్లో కాంప్రమైజ్ అయితే ఒక వేళ మీరు నేరస్తులుగా ఎఫ్ఐఆర్ నమోదు అయి ఉంటే మీకు నష్టం మాత్రమే జరుగుతుంది తప్ప లాభం జరగదని న్యాయ నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. మీరు నేరం స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్..
What is Election Code: ఎన్నికల కోడ్‌ అంటే ఏమిటి? ఏయే అంశాలపై నిషేధం విధిస్తారు?
Aam Aadmi Bima Yojana: ఆమ్‌ ఆద్మీ బీమా యోజన పథకానికి ఎవరు అర్హులు?
Caveat Petition: కేవియట్‌ పిటిషన్‌ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలేంటి? ఎవరు వేయవచ్చు?
Retirement Age: వర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు పెంపు

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading