Puja Khedkar: ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్ ఇచ్చింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తప్పుడు ధ్రువీపత్రాలు సమర్పించారని ఆరోపణలు వెల్లువెత్తడంతో పూజా ఖేద్కర్ ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది యూపీఎస్సీ (UPSC). ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటుగా భవిష్యత్లో యూపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలోనూ పాల్గొనకుండా డీబార్ చేసేసింది.
పూజా ఖేద్కర్ వివాదంపై ఇవాళ (జూలై 19) యూపీఎస్సీ కమిషన్ అధికారికంగా స్పందించింది. యూపీఎస్సీ చేపట్టిలన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022 లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ నిబంధనలను తుంగలో తొక్కిందని నిర్ధారించారు.
సివిల్స్ పరీక్ష గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫొటోలు, సంతకాలు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఇంటి చిరునామాతో పాటు ఇతర వివరాలన్నీ తప్పుడు ధృవీకరణ పత్రాలనే సమర్పించినట్లు ఎంక్వైరీలో తేలిందని యూపీఎస్సీ అఫిషియల్ గా ప్రకటించింది. ఈ మేరకు ఓ నోట్ ను మీడియాకు వెలువరించింది.
మోసపూరిత కార్యకాలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు సదరు నోట్ లో పేర్కొన్నారు. సివిల్ సర్వీస్ పరీక్ష -2022 నిబంధనల మేరకు భవిష్యత్లో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా డీబార్ చేశామని వెల్లడించారు.
యూపీఎస్సీ పరీక్షల్లో తప్పుడు పత్రాలు సమర్పించి మోసం చేయడంతో పూజా ఖేద్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
ఇవీ చదవండి: Puja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా ఉంటాయంటే..
Indian 2: సేనాపతికి ఊహించని షాక్.. వారం రోజుల కలెక్షన్లు ఇంతేనా?
BP Control: ఈ రెండు చిట్కాలతో మాత్రలు వేసుకోకుండా బీపీ నియంత్రణ!
