బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Jana Nayagan: ఆ ఘ‌ట‌నపై చాలా కోపం వ‌చ్చింది.. నాకూ ఆ బాధ తెలుసు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 12 ఏప్రిల్ 2026

Jana Nayagan: సినిమా రూపుదిద్దుకోవడం వెనుక వందలాది మంది కష్టపడతారు. కథా రచయితల నుంచి టెక్నీషియన్లు, నటీనటులు వరకు ప్రతి ఒక్కరి శ్రమతోనే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే థియేటర్లలో విడుదలకు ముందే సినిమా లేదా కీలక సన్నివేశాలు పైరసీకి గురైతే ఆ కష్టం మొత్తం వృథా అవుతుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్యలలో పైరసీ ఒకటి.

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగణ్’ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా, టెలిగ్రామ్ ఛానళ్లలో లీక్ అయినట్లు సమాచారం. దీంతో చిత్రబృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

లీక్‌లపై నిర్మాణ సంస్థ హెచ్చరిక
సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించింది. ఎవరైనా ఈ పైరసీ వీడియోలను చూడడం, డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి ఘటనలు జరగడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం కలుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పైరసీ కారణంగా థియేటర్లలో కలెక్షన్లు కూడా ప్రభావితం అవుతాయి.

విజయ్ దేవరకొండ స్పందన
ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా లీక్ అవడం ఎంత బాధ కలిగిస్తుందో తనకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నాడు. కెరీర్ ప్రారంభ దశలో తాను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పాడు. సినిమా లీక్ అయితే నటులు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాదు.. ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి కష్టానికి దెబ్బ తగులుతుందని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఈ లీక్ వెనక ఉన్నవారిని త్వరగా గుర్తించాలని, అది చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుందని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ‘జననాయగణ్’ మూవీ టీమ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపాడు.

‘టాక్సీవాలా’ లీక్ ఘటన గుర్తు చేసిన విజయ్
విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా ఒకసారి ఇలాంటి సంఘటన జరిగింది. ఆయన నటించిన ‘టాక్సీవాలా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

ఆ ఘటనతో విజయ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. తన కెరీర్ ముగిసిపోయిందేమో అన్న భావనతో గదిలో కూర్చుని ఏడ్చినట్లు గతంలో చెప్పాడు. అయితే చివరికి సినిమా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించి రిలీజ్ చేశారు. ఆశ్చర్యకరంగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

పైరసీపై సినీ పరిశ్రమ ఆందోళన
ప్రస్తుతం సినిమాలు విడుదలకు ముందే లీక్ కావడం సినీ పరిశ్రమకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానళ్లు, టోరెంట్ సైట్లు, అనధికారిక వెబ్‌సైట్లు ఈ పైరసీకి కేంద్రంగా మారుతున్నాయి.

ఇలాంటి ఘటనలను అరికట్టడానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అమలు లోపాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. పైరసీని అరికట్టేందుకు టెక్నాలజీ ఆధారిత భద్రతా చర్యలు తీసుకోవాలని పరిశ్రమ కోరుతోంది.

ఇవీ చ‌ద‌వండి: Jana Nayagan Movie: రిలీజ్‌కు ముందే లీక్ అయిన దళపతి విజయ్ ‘జన నాయగణ్’ మూవీ.. రాజకీయాలకు ముందు పెద్ద షాక్
Jana Nayagan: ‘జన నాయగన్’కు సెన్సార్ అడ్డంకులు… విడుదలపై అనిశ్చితి
Vijay Rashmika: రిలేటివ్ పెళ్లి వేడుకలో విజయ్–రష్మిక సందడి… వైరల్ అవుతున్న ఫోటోలు

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading