శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Life Style

Urine Holding: ఎక్కువ సేపు మూత్రం ఆపుతున్నారా? వచ్చే ఇబ్బందులు ఇవీ..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 1 ఆగస్టు 2024

Urine Holding: వర్షాకాలం ఎక్కువ నీరు తాగితే మాటిమాటికీ మూత్రం పోసుకోవాల్సి వస్తుంది. కానీ, సాధారణంగా జర్నీల్లో కానీ, ఫంక్షన్లు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు, స్కూళ్లు, కాలేజీల్లో పిల్లలు, మహిళలు, ఇలా చాలా రకాలుగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకోవడం జరుగుతుంటుంది. కానీ ఇలా మూత్రం ఆపడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

వయసును బట్టి మూత్రాన్ని కొంత సమయం దాకా ఆపుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు వారు మూత్రాన్ని గంట వరకు ఆపుకోగలరు. అదే 10 సంవత్సరాలు దాటిన వారు సుమారు రెండు గంటల వరకు మూత్రాన్ని ఆపుకున్నా పెద్ద ఇబ్బంది పడరు. 30 సంవత్సరాలు దాటిన వారు మూడు నుంచి 5 గంటల వరకు మూత్రాన్ని ఆపుకోగలుగుతారని వైద్యులు అంటున్నారు.

ఆరోగ్యానికి మంచిది కాదు..
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మీ మూత్రాశయ కండరాలు బలహీనపడతాయంటున్నారు. ఎక్కువ సేపు ఇలా ఆపుకుంటూ పోతే.. మూత్రాన్ని ఆపుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గుతుందట. అలాగే మూత్రం లీక్ అయ్యే ప్రమాదం కూడా ఏర్పడుతుందని చెబుతున్నారు. మూత్రాన్ని ఎక్కువసేపు బిగపట్టుకోవడం వల్ల మీకు కటి నొప్పి వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ సమస్య కటి తిమ్మిరిగా కూడా మారే ప్రమాదం ఉందట. దీని కారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మూత్రాశయాన్ని ప్రతి కొన్ని నిమిషాలకోసారి ఖాళీ చేయాలని, ఇది యూటీఐ ప్రమాదాన్ని మరింత పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లు
మూత్రాన్ని చాలా సమయం ఆపి పట్టుకోవడం వల్ల మీ మూత్రాశయం దెమబ్బతింటుంది. సాగిపోవడం లాంటిది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ తర్వాత మూత్ర విసర్జన చేయడం మీకు చాలా కష్టం అవుతుంది. దీంతోపాటు మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం లాంటి సమస్యలు ఉంటే.. మూత్రాన్ని ఎక్కువసేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మళ్లీ ఏర్పడతాయి. అందుకే వీలైనంత వరకు మూత్రాన్ని ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి ఖాళీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Black Rice: బ్లాక్ రైస్ తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మీకు తెలుసా?
Child Care: చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపాలి?
Tobacco: పొగాకుతో వచ్చే దుష్పరిణామాలు తెలుసా? తప్పక తెలుసుకోండి
Calcium: శరీరంలో క్యాల్షియం తగ్గితే ఏం జరుగుతుంది? సంకేతాలు ఇవీ..!
Jaundice: పచ్చ కామెర్ల లక్షణాలు ఏంటి? మద్యం అతిగా తాగితే జాండీస్‌ వస్తాయా?

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading