Janhvi Kapoor: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అబుదాబిలో అత్యంత వైభవోపేతంగా సాగింది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ వేడుక ఆదివారం సెప్టెంబర్ 29న ముగియనుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి చాలా మంది నటీనటులు పాల్గొన్నారు.
తాజాగా దేవర మూవీలో నటించిన జాన్వీ కపూర్ కూడా ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేసింది. ఈవెంట్ కోసం జాన్వీ గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ గౌన్ వేసి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ డ్రెస్ లో జాన్వీ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. లూజ్ హెయిర్ జాన్వీ అందాన్ని మరింత పెంచింది.
ఐఫా ఈవెంట్ లో జాన్వీ లుక్స్‌తో పాటు ఆమె వేసుకున్న నెక్లెస్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జాన్వీ ధరించిన నెక్లెస్ విలువ దాదాపు రూ.8 కోట్లట. ఈ నెక్లెస్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వామ్మో ఇంత కాస్ట్ లీ నెక్లెసా అంటూ నెటిన్లు ఆశ్చర్యపోతున్నారు.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..
Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..
Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
