HomeTelanganaCM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: కమ్మ అంటే ఒక కులం కాదని, అమ్మ లాంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మట్టి నుంచి బంగారాన్ని తీయగలిగే శక్తి కమ్మవారికి ఉందన్నారు రేవంత్. పది మందిని ఆదుకునే గుణం కమ్మవారిదని పేర్కొన్నారు. కమ్మ సామాజికవర్గం తనను ఆప్యాయంగా చూసుకుంటుందన్నారు. ఎలాంటి నేలలో అయినా పంటలు పండించగల శక్తి కమ్మవారికి ఉందన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని కొనియాడారు. ఎంతోమందిని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కమ్మవర్గం అందరూ సహకరించాలని కోరారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తోందని స్పష్టీకరించారు రేవంత్.

ఇటీవల చంద్రబాబు అరెస్టు సందర్భంగా హైదరాబాద్ లో కమ్మ సామాజికవర్గం నిరసనలు తెలిపితే అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై రేవంత్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తమకు నచ్చని విషయాలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్న రేవంత్.. దాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు అద్దం పట్టాయని గుర్తు చేశారు.

తెలుగు వారు, కమ్మ వారైన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని అంతా ఆశించామని, కానీ కాకపోవడం నిరాశ కలిగించిందన్నారు రేవంత్. ఒకప్పుడు ఢిల్లీలోనూ తెలుగువారి వాణి బాగా వినిపించేదని, నాయకత్వం కనిపించేదన్నారు. కానీ ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మళ్లీ అలాంటి నాయకత్వం రావాలన్నారు. కమ్మసంఘం కోసం కేసీఆర్ సర్కార్ ఐదెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి లిటిగేషన్లు పెట్టిందని విమర్శించారు. తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణానికి కూడా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్.

చంద్రబాబు గురించి..
ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు రేవంత్. అదే తనను ఇంతటి స్థానంలో కూర్చోబెట్టిందనడంలో సందేహం లేదన్నారు. ఎన్జీ రంగా, వెంకయ్య నాయుడు తదితరుల పేర్లు చెప్పిన అనంతరం.. చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తామని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపైనా వివక్ష చూపబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదంటూ రేవంత్ వివరించారు.

ఇవీ చదవండి: Telangana: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్
Types of Emotions: మనిషి జీవితంలో భావోద్వేగాలు ఎన్ని రకాలు?
Types of Smiles: మనిషి నవ్వుల్లో ఎన్ని రకాలు? ఏఐ ఏం చెప్పిందంటే..!
Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!
Indian 2: సేనాపతికి ఊహించని షాక్.. వారం రోజుల కలెక్షన్లు ఇంతేనా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు