Salt uses in daily life: శరీరం సరిగ్గా పని చేయాలంటే ఉప్పు చాలా ముఖ్యమైంది. అందుకే ఆహారంలో రుచితో పాటు ఆరోగ్యం కోసం ఉప్పును వాడుతుంటాం. కానీ.. ఎక్కువైనా, తక్కువైనా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎక్కువ కాలం ఉప్పును మోతాదుకు మించి వాడితే అనారోగ్యానికి గురవుతారు. రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యలు పెరుగుతాయి. (Salt uses in daily life)
ఆహారం రుచిని పెంచే ఉప్పు మోతాదును మించితే ముప్పుగా మారుతుంది. ఉప్పు అధికంగా వాడితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా హిమాలయన్ పింక్ సాల్ట్, ఇతర రకాల సముద్ర ఉప్పులు ప్రయోజనకరం అని వివిధ పరిశోధనల్లో వెల్లడయింది. రోజువారీగా వాడే ఉప్పులో ఏది మంచిది, ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరం?
శరీరానికి సోడియం చాలా అవసరం. శక్తి ఉత్పత్తి, ప్రతీకణానికి ఆక్సీజన్ సరఫరా, కణాల కదలికలకు సోడియం కీలక పదార్థం. పొటాషియం, కాల్షియం కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. జీవ క్రియలకు ఈ మూలకాలు అత్యంత అవసరం. ఉప్పు ద్వారా శరీరానికి సోడియం లభిస్తుంది. కానీ.. ఆహారంలో ఉప్పును నియంత్రణలో పెట్టుకోవాలి. ఫలితంగా రక్తపోటు ఉన్నవాళ్లకు తగ్గిస్తుంది. రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నవాళ్లకు ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తపోటు ఎక్కువయితే కిడ్నీలు, గుండె, మెదడుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
రోజుకు ఎంత ఉప్పు అవసరం
మనదేశంలో సహజంగానే ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటుంది. కొందరైతే రుచి కోసం ఉప్పు మరీ ఎక్కువగా వేసుకుంటారు. కానీ సాధారణంగా ప్రతీ మనిషికి రోజుకు 3 గ్రాముల ఉప్పు మాత్రమే అవసరం ఉంటుంది. రుచి కోసం వేసుకునే ఉప్పు అనర్థాలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నా లేకున్నా ఎక్కువగా ఉప్పు తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6శాతం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రోజుకు 2300 మిల్లీ గ్రాములకు మించి సోడియంతీసుకోవద్దని అమెరికా హార్ట్ అసోసియేషన్ ఓ అధ్యయనంలో తెలిపింది. 14 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా తక్కువ వాడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. రోజుకు 2 గ్రాములకు మించి ఉప్పు తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది.
టేబుల్ సాల్ట్ వాడకం తగ్గించడం ఉత్తమం
గతంలో మామూలుగా ఉప్పు అమ్మేవారు. ఇప్పుడు ఉప్పుకు అయోడిన్,ఐరన్, ఫోలిక్ యాసిట్ వంటి మూలకాల్ని జోడించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. శరీరంలో ద్రవ్యాల్ని సమతుల్యంలో ఉంచడానికి, నరాల ఆరోగ్యానికి, ఆహారంలోని పోషకాల్ని శరీరం స్వీకరించేందుకు, కండరాల పనితీరుకు సోడియం అవసరం. ఉప్పులో సడియం ఉంటుంది. కానీ సోడియం మోతాదుకు మించి తీసుకుంటే అధిక రక్త పోటుకు దారి కారణమవుతుంది. బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
సాధారణంగా మనం ఉపయోగించే టేబుల్ సాల్ట్ అధికంగా తీసుకోవడం వల్ల అనర్థాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాక్ సాల్ట్, పింక్‌సాల్ట్, హిమాలయన్ సాల్ట్ వాడితే ఏమైనా నష్టాలు తగ్గుతాయా అనే సందేహాలు కూడా పలువురిలో ఉంటాయి. కానీ.. టేబుల్ సాల్ట్‌కు, ఇతర సాల్ట్‌లకు కూడా పెద్దగా తేడా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాకపోతే పింక్, రాక్ సాల్ట్‌లలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్, క్రోమియం దాదాపు ఒకశాతం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల పెద్దగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పెద్దగా ఏమీ ఉండవు. రాక్ సాల్ట్ మంచిది అనే భావనతో మోతాదుకు మించి తింటే సమస్యలు వస్తాయి.
ఇదీ చదవండి: Money Tips: ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలంటే.. ఉప్పుతో ఇలా చేయండి!