Money Tips: ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలంటే.. ఉప్పుతో ఇలా చేయండి!

Money Tips: ఉప్పుతో కొన్ని పనులు చేస్తే మీ సంపద పెరుగుతుంది.. ఎలా చేయాలంటారా.. అయితే ఇది చదవండి.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాచుకోవడమూ అంతే ముఖ్యం. సంపాదన కేవలం తినడానికి, ఖర్చు పెట్టడానికి కాకుండా కాస్త పొదుపుకూడా చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా గడపగలుగుతారు. ఇక ఇంట్లో సిరిసంపదలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోకుండా కాస్త మనదగ్గర కుదురుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలి. (Money Tips)

మనలో చాలా మంది అప్పుల బాధతోనే, ఆర్థిక సమస్యలతోనో ఇబ్బంది పడుతుంటారు. ప్రతి ఒక్కరికీ ప్రస్తుత జీవన శైలి ప్రకారం డబ్బు అవసరం. డబ్బు లేనిదే జీవితం సాఫీగా సాగిపోవడం కష్టం. డబ్బు సంపాదించడం కోసం రోజూ అనేక వృత్తి, వ్యాపారాలు, వ్యాపకాలు చేసుకుంటూ బతుకుతుంటారు. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారికి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇంట్లోకి సిరిసంపదలు వచ్చి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు.

Read Also : Money Tips in Astrology: అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?

డబ్బు మనకు నెగిటివ్‌ వే నుంచి రావొచ్చు. పాజిటివ్‌ వే నుంచి కూడా రావచ్చు. వచ్చిన డబ్బుకు నెగిటివ్‌ నెస్‌ కడిగేసుకోవాలనుకుంటే అందుకు కొన్ని మార్గాలున్నాయి. అందులో ముఖ్యమైనది.. ఇది అత్యంత సులభంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే చేసుకొనే ప్రక్రియ. ఓ పెద్ద స్టీల్‌ పళ్లెం తీసుకోవాలి. అందులో మొదట రాళ్ల ఉప్పు ఒక లేయర్‌ పరవాలి. దానిపై కాస్త పసుపు, కుంకుమ వేయాలి. తర్వాత మీరు తెచ్చిన డబ్బు అంతా ఓ క్రమ పద్ధతిలో అక్కడ పెట్టుకోవాలి.

ఇలా అన్ని నోట్లూ ఉప్పుకు తగులుతూ ఉండేలా చూసుకోవాలి. ఇలా మూడు రాత్రులు ఉంచాలి. ఇంట్లో దేవుడి పటాల వద్ద లేదా పూజా మందిరంలో ఇలా మూడు రాత్రులు నోట్లతో కూడిన పళ్లెం ఉంచాలి. మూడో రోజు ఉదయాన్నే ఈ పళ్లెం తీయాలి. పళ్లెంలోని ఉప్పును బకెట్‌ నీటిలో కలిపి తర్వాత పారపోసేయాలి. డబ్బుకు పట్టిన నెగిటివ్‌ ఎనర్జీ అంతా ఉప్పు తీసేసుకుంటుంది. అక్కడ ఉంచిన డబ్బులో రెండు లేదా మూడు నోట్లు తీసి ఇంట్లో దాచుకోవాలి. తర్వాత ఓ రెండు మూడు నెలలు దాటాక ఇంట్లో డబ్బు వృద్ధి జరుగుతుంది.

Read Also : Aloe Vera for Money: కలబందతో అందం, ఆదాయం కూడా.. పాజిటివ్‌ ఎనర్జీ!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles