Mother Health Tips: పాలిచ్చే తల్లులు చేస్తున్న కొన్ని పనుల వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పాలు సమృద్ధిగా కలగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనులు మానుకోవాలి. పాలిచ్చే తల్లులు టీ, కాఫీ లాంటివి ఎక్కువ తీసుకోరాదు. తల్లి తీసుకొనే ఆహారంపై బిడ్డ ఆహారం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కాఫీ, టీలు అధికంగా తీసుకుంటే కెఫెన్ మోతాదు పెరిగి బిడ్డకు అనారోగ్యం వ్యాపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. (Mother Health Tips)
తల్లి పాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం. ఒక రకంగా చెప్పాలంటే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ప్రస్తుత గజిబిజి జీవితంలో కొందరు తల్లులు తమకు సమృద్ధిగా పాలుఉన్నప్పటికీ బిడ్డకు ఇవ్వలేకపోతుంటారు. అందుకు కారణాలు చాలా ఉంటాయి. అయితే, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చెబుతున్నారు.
పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడటం మానుకోవాలి. ఏ ట్యాబ్లెట్ పడితే అది వాడటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలా తల్లికి ఉపశమనం కలుగుతుందేమో గానీ బిడ్డకు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి వాటి జోలికి పోరాదు. మారిన జీవన శైలి నేపథ్యంలో మహిళలూ కొన్ని దురలవాట్లకు బానిసలయ్యారు. ఇవి మానుకోవాలని చెబుతున్నారు.
అలాంటి ఫుడ్ తీసుకోరాదు..
అలర్జీలు కలిగించే ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బిడ్డకు దాని వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయంటున్నారు. తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆహారం తీసుకొనే విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. శుభ్రత పాటించడం ముఖ్యం. పాలిచ్చే తల్లులు కచ్చితంగా రెండూ పూటలా స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బాడీ స్ప్రేలు, మాయిశ్చరైజర్లు పూసుకోవడంపైనా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. స్థనాలను వదిలేయాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అప్పుడే మీతోపాటు బిడ్డ ఆరోగ్యమూ పదిలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Parenting Tips: పిల్లల పెంపకంపై దృష్టి పెట్టడం లేదా? ఏం జరుగుతుందంటే..