Parenting Tips: పిల్లలకు వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఎవరికి వారు ప్రత్యేకతతో ఉంటారు కాబట్టి ఎదుగుతున్న క్రమంలో వారిని కేరింగ్‌గా చూసుకోవడం ముఖ్యం. కుటుంబ వాతావరణం, పరిసరాల్లోని ప్రభావం.. ఇలా అన్ని అంశాలూ వీరిపై ప్రభావం చూపుతాయి కాబట్టి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్లిష్టతరమైన పరిస్థితులు ఎదరూనప్పుడు వారిలో మనోధైర్యాన్ని నింపేలా చూసుకోవాలి. (Parenting Tips)
పేరెంటింగ్ అనేది ఒక భిన్నమైన టాస్క్. పిల్లలను పెంచడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా వారి కెరీర్‌పై అది ప్రభావం చూపుతుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. మానసికంగా, శారీరకంగా పరిణతి సాధించాలని భావిస్తారు. అయితే, అందుకు అనుగుణంగా తల్లిదండ్రుల ప్రవర్తన కూడా ముఖ్యం అని సైకాలజిస్టులు చెబుతున్నారు. మానసికంగా పరివర్తన చెందడం కోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ కూడా పక్కదారి పట్టేందుకు దోహదం చేస్తుంది. ఇలాంటి సమయాల్లో నియంత్రణ అవసరం. ముఖ్యంగా టీనేజ్ వయసు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని వారి జీవితానికి ఇబ్బంది కలగని వాటికి అనుమతించాలి. తల్లిదండ్రులతో అన్ని అంశాలనూ పంచుకొనేలా వారిని ప్రోత్సహించాలి. వారు చెప్పేది వినడానికి కాస్త సమయం కేటాయించాలి.
వ్యతిరేకత వచ్చేలా చేసుకోవద్దు
పిల్లలు ఎప్పుడూ వారు కోరినది తల్లిదండ్రులు అంగీకరించాలని ఆశిస్తుంటారు. అయితే, ఇది అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు. వారు అడిగిన ప్రతి దానికి ఎస్ అని చెప్పినా చిక్కులు వచ్చి పడతాయి. టీనేజ్ వయసు వచ్చిన పిల్లలకు ధూమపానం, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వాటి వల్ల దుష్పరిణామాలు వివరించాలి. అయితే, కట్టడి పేరుతో అన్ని విషయాల్లోనూ వారిని నియంత్రణలో ఉంచుకోరాదు. ఇలా చేయడం వల్ల విపరీతమైన నెగిటివిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే, వారిపై నిఘా ఉంచడం మంచిదని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: Milk and honey : పాలలో ఇది కలిపి తాగితే జబ్బులు దరిచేరవు.. తప్పక ప్రయత్నించండి