Goddesses Laxmi and Plants: ఇంట్లో ఆనందానికి, శ్రేయస్సుకు ప్రతీకగా ఉండాలంటే మొక్కలు పెంచుకోవడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ రకాల మొక్కలు పెంచాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో మనీప్లాంట్ పెంచుకోవడం వల్ల ఆర్థికంగా వృద్ధి సాధించగలుగుతారు. మనీప్లాంట్‌తోపాటు కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా డబ్బుకు ఢోకా లేకుండా ఉంటుంది. (Goddesses Laxmi and Plants)
సాధారణంగా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రం ప్రసరించి, ఐశ్వర్యం సిద్ధించాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు అనేక మార్గాలు అనుసరిస్తుంటారు. అయితే ఎన్ని పద్ధతులు పాటించినా ఇంట్లో ధనం నిలవక కొంత మంది సతమతం అవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. వాటిలో ఒకటి ఇంట్లో మనీప్లాంట్‌తోపాటు కొన్ని మొక్కలను పెంచుకోవడం.
మనీప్లాంట్‌తోపాటు ఇంట్లో దానిమ్మ మొక్కను పెంచుకోవాలి. దానిమ్మ మొక్క ద్వారా ఇంట్లో ఆరోగ్యపరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందేలా చేస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందడం సులువవుతంది. దానిమ్మ మొక్కను నాటేక్రమంలో దాన్ని నైరుతి దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే వెదురు మొక్కను కూడా పెంచుకోవాలి. దీన్ని శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో ఉంచినట్లయితే ఇంట్లో డబ్బ ప్రవాహం పెరుగుతుంది.
బిల్వ మొక్కతో బోలెడు లాభాలు..
మరోవైపు ఇంటి ముందు గుమ్మడి తీగ ఉండటం వల్ల జీవితంలో డబ్బుకు కొరత లేకుండా ఉంటుందని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరియాలంటే గుమ్మడి తీగను ఉంచుకోవాలని చెబుతున్నారు. సంతానవృద్ధి కూడా సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. ఇక బిల్వ మొక్కను పెంచుకుకంటే శుభప్రదమట. ఈశ్వరుడు బిల్వ మొక్కలు నివసిస్తాడని నమ్ముతారు. శివుడు స్వయంగా ఉన్న ఇంట్లో ఎలాంటి కొరత లేకుండా హాయిగా జీవిస్తారని వాస్తు నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఖర్చుల భారం తగ్గి ఆదాయం పెరుగుతందట. వీటన్నింటితోపాటు ఇంట్లో మనీప్లాంట్ పెట్టుకోవడం ద్వారా అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఆగ్నేయ మూలలో మనీప్లాంట్‌ను పెంచడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
ఇదీ చదవండి: Money Tips in Astrology: అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?