Money Tips in Astrology: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొందరు సతమతం అవుతుంటారు. అనుకోని ఖర్చులు పెరిగిపోవడం కావచ్చు, ఇంట్లో అవసరాలకు కావచ్చు, వస్తున్న జీతం సరిపోక కావచ్చు.. ఇలా అనేక రకాల కారణాల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంకా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం కూడా అనేక మంది తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో అప్పులు నానాటికీ పెరిగిపోతే చివరకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు (Money Tips in Astrology) జ్యోతిష్య శాస్త్రంలో అనేక ఉపాయాలు నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం సమాజంలో ఎవరిని కదిలించినా అప్పులతో ఇబ్బంది పడుతున్నామనే సమాధానం వినిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. అప్పుల భారం దించుకోలేకపోతున్న వారికి పలు ప్రత్యామ్నాయ మార్గాలను జ్యోతిష్య నిపుణులు, పెద్దలు సూచించారు. అందులో ఒకటే మంగళవారం నియమాలు పాటించడం. మంగళవారానికి మారు కోరుతుందని పెద్దలు చెబుతున్నారు. అందుకే మంగళవారం ఏం పని చేస్తే మళ్లీ అదే పని చేస్తారని చెబుతున్నారు. మంగళవారం ఏం పని చేసినా అది రిపీట్ రిపీట్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
మంగళవారం రోజు ఒక్క రూపాయి అయినా అప్పు తీర్చాలని పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అతి త్వరగా అప్పుల ఊబి నుంచి ఉపశమనం పొందగలుగుతారని చెబుతున్నారు. ఇది పూర్వం రోజుల నుంచి వస్తోందని, జ్యోతిష్య శాస్త్రంలో సైతం నిరూపితమైందని, ఇంతకు మించిన రెమెడీ మరోటి లేదని స్పష్టం చేస్తున్నారు. మంగళవారం నాడు అప్పులు కొంత మేరకైనా తీర్చుకుంటూ పోతే క్రమంగా అప్పులు ఐస్‌క్రీమ్ లాగా కరిగిపోవాల్సందేనంటూ కుండబద్ధలు కొడుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
సాధారణంగా మంగళవారం డబ్బులు ఇవ్వకూడదని చాలామంది చెబుతుంటారు. అయితే, అప్పులు తీర్చుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మంగళవారం అప్పు తీరిస్తే.. మళ్లీ మంగళవారం దాకా కూడా అక్కర్లేదు.. వెంటనే తీర్చేస్తారట. ఏదో ఒక కారణంగా, ఎవరో ఒకరు మీ చేతిలో డబ్బు పెడతారట. అనుకోకుండా డబ్బు మీ వద్దకు వచ్చి చేరుతుందట. ఇది మంగళవారానికి మాత్రమే ఉన్న లక్షణమని జ్యోతిష్య నిపుణులు గంటా బజాయించి మరీ చెబుతున్నమాట. తప్పనిసరిగా అప్పు తీర్చడం అనేది మంగళవారం మొదలు పెట్టి చూడండం.. ఫలితం మీరే చూడాలని చెబుతున్నారు. దీనికోసం పెద్దగా జ్యోతిష్య పండితులను కూడా ఆశ్రయించాల్సిన పని లేదట. ప్రాక్టికల్‌గా ఇది జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఉందని పెద్దలు చెబుతున్నారు.
నట్టింట్లో లక్ష్మీదేవి నాట్యం చేయాలంటే మహిళా మణులు ఇలా చేయండి..
శుక్రవారం అంటే లక్ష్మీవారంగా హిందువులు భావిస్తారు. శుక్రవారం తలంటు స్నానం చేయరాదని, డబ్బులు ఖర్చు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయరాదని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆడవారు శుక్రవారం పూట కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. స్త్రీలు శుక్రవారం రోజున ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. శుక్రవారం పూట ఆడవారు ప్లాస్టిక్ గాజులు ధరించరాదట. మట్టి గాజులు వేసుకోవాలట. లేదా బంగారం గాజులు వేసుకోవచ్చట. బంగారం గాజులు లేకపోతే కనీసం మట్టి గాజులైనా ధరించాలని సూచిస్తున్నారు.
స్త్రీలు శుక్రవారం పూట తలలో పేలు చూసుకోరాదు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్లిపోతుందని చెబుతున్నారు. శుక్రవారం పూట స్త్రీలు అబద్ధాలు చెప్పరాదట. అబద్ధాలు చెబితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు.. వీటిని శుక్రవారం పూట ఎవరికీ ఇవ్వరాదని సూచిస్తున్నారు.
Read Also : Adipurush Pre Release Event: తిరుపతిలో జై శ్రీరామ్.. వేలాదిగా తరలి వచ్చిన ప్రభాస్ అభిమానులు