2020లో కరోనా ఎంతటి విపత్కర పరిస్థితులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఆప్తులను కోల్పోయారు. మరికొందరు అనాధలయ్యారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు తెలిసిన వ్యక్తులు, ఆఫీసుల్లో, ఇంటా, బయటా తెలిసిన వారు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అప్పగించాయి. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొన్ని కంపెనీల్లో కొనసాగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కువగా స్మార్ట్ ఫోను వాడటం మొదలు పెట్టారు. ఇందులో ఎక్కువ శాతం ప్రజలు డేటింగ్ యాప్స్ ను (Dating Apps) వినియోగించారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఒకప్పుడు ఆన్ లైన్ డేటింగ్ (Dating Apps) అనేది మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడది (Dating Apps) చిన్న నగరాలకు కూడా వ్యాప్తి చెందింది.
చాలా మంది యువతీ యువకులు ప్రేమించుకోవాడనికి, పెళ్లి చేసుకోవడానికి డేటింగ్ యాప్ లను వినియోగిస్తున్నారని తేలింది. వ్యక్తిగత డేటింగ్ లో వీడియో కాల్స్ కు ప్రాధాన్యి ఇస్తున్నారట. ఇప్పుడు డేటింగ్ యాప్ లలో వినియోగం చిన్న నగరాలు, పట్టణాల్లో 70 శాతానికి పైగా పెరిగిందని తేలింది.
దేశంలోని అహ్మదాబాద్, సూరత్, లక్నో, జైపూర్, చండీగఢ్, పాట్నా తదితర పట్టణాల్లో డేటింగ్ యాప్ ల వినియోగం బాగా పెరిగిందట. ఈ డేటింగ్ ప్లాట్ ఫాంలను వాడే వారిలో మహిళలే అత్యధికంగా ఉండటం విశేషంగా చెబుతున్నారు. డబ్బులు చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదట. మనదేశంలో చాలా డేటింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టాప్ లో టిండర్ నిలిచింది. తర్వాత బంబుల్, ట్రూలీ మ్యాడ్లీ తదితర యాప్ లు ఉన్నాయి.
Mobile At Morning: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా?
స్మార్ట్ యుగంలో సెల్ ఫోన్ లేనిదే ఏ పనీ జరగదంటే అతిశయోక్తి కాదేమో. మన జీవితంలో సెల్ ఫోన్ నిత్యావసరాల జాబితాలో చేరిపోయింది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక విపరీతంగా వాడకం పెరిగిపోయింది. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. అవసరం లేకున్నా ఏదో ఒకటి నొక్కుతూ సమయం వృధా చేసుకుంటున్నారు. కనీసం తినే సమయంలోనూ కొందరు సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటారు. సెల్ ఫోన్ మాయలో పడి వేళకు తిండి మానేస్తుంటారు.
సెల్ ఫోన్ వెలుగులు రాత్రి పడుకొనే సమయంలోనూ, ఉదయం నిద్ర లేవగానే మన కళ్లపై పడటం ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఈ అలవాటు మానుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూడరాదని చెబుతున్నారు. అప్పటిదాకా ప్రశాంతంగా పడుకుని ఉంటారు.. అప్పుడే సెల్ ఫోన్ వెలుగు పడితే కళ్లకు ప్రమాదమట. రోజంతా యాక్టివ్ గా ఉండలేకపోవడానికి ఇది కారణం అవుతుంది.
ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూడటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది నిద్ర లేస్తూనే సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తుంటారు. రాత్రి పడుకొనే ముందు కూడా సెల్ ఫోన్ గంటల తరబడి చూడటం, ఉదయం లేవగానే దానిపై టైమ్ స్పెండ్ చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం అనేక సమస్యలకు తావిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే మొబైల్ చూడటానికి బదులుగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం ప్రత్యామ్నాయాలుగా సూచిస్తున్నారు. లేవగానే గోరు వెచ్చటి నీళ్లతో ఫేస్ కడుక్కొని కళ్లను తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అలా కాదని లేవగానే సెల్ ఫోన్ చూస్తూ ఉండిపోతే అనేక సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. రోజంతా తలనొప్పిగా ఉండటం, కళ్ల జబ్బులు పెరుగుతాయి.
Read Also : ChatGPT: ఛాట్ జీపీటీతో గూగుల్‌కు ముప్పు తప్పదా? ఛాట్ జీపీటీ అంటే ఏంటి?