ChatGPT: ఛాట్‌ జీపీటీతో గూగుల్‌కు ముప్పు తప్పదా? ఛాట్‌ జీపీటీ అంటే ఏంటి?

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు ఇప్పుడు గుబులు పట్టుకుందా? ఛాట్‌ జీపీటీ (ChatGPT) దెబ్బకు గూగుల్‌ గింగిరాలు తిరుగుతోందా? అసలు ఛాట్‌జీపీటీ అంటే ఏంటి? దాన్ని ఎలా వాడాలి? ఛాట్‌ జీపీటీ (ChatGPT) వల్ల ఉపయోగాలేంటి? ఛాట్‌ జీపీటీతో (ChatGPT) మైనస్‌లు కూడా ఉన్నాయా? గూగుల్‌ సెర్చ్‌లో చాలా వరకు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వెతికే వారి సంఖ్య పెరిగిపోయంది. అసలు వచ్చిన ఐదు రోజుల్లోనే పది లక్షల మంది యూజర్స్‌ను ఎలా సంపాదించగలిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.. ఓ లుక్కేయండి..

వన్‌ మిలియన్‌ యూజర్లను సొందం చేసుకొనేందుకు పెద్ద పెద్ద బడా కంపెనీలకే చాలా ఏళ్లు పట్టింది. నెట్‌ఫ్లిక్స్‌కు ఏకంగా ఏడాది పట్టింది. ట్విట్టర్‌కు రెండేళ్లు, స్పాటిఫైకి ఐదు నెలలు పట్టింది.. అయితే, ఛాట్‌ జీపీటీకి మాత్రం కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే వన్‌ మిలియన్‌ మార్క్‌ కొట్టేసింది. ఈ దెబ్బకు గూగుల్‌ కూడా భయపడింది. భవిష్యత్‌లో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను రీప్లేస్‌ చేస్తుందా? అనే భయాలు పట్టుకున్నాయి. ఇది కచ్చితంగా జరగబోతోందంటూ ప్రస్తుతం జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఛాట్‌ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు.

మొదట ఛాట్‌ జీపీటీ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఛాట్‌ బోట్‌ గురించి తెలియాలి. మనం అప్పుడప్పుడూ వాట్సప్‌లో కస్టమర్‌ కేర్‌ను సంప్రదిస్తూ ఉంటాం. హాయ్‌ అని మెసేజ్‌ పెట్టగానే అటు వైపు నుంచి రిప్లయ్‌ వస్తుంది. అయితే అక్కడి నుంచి సమాధానం ఇచ్చేది మనిషి కాదు. ఛాట్‌బోట్‌ సాయంతో రిప్లయ్‌ ఇస్తుంటారు. ఇలా ఇక్కడ మనిషి అడిగే ప్రశ్నలకు కంప్యూటర్ సమాధానాలు ఇస్తుంటుంది. అక్కడ మనిషి లేకున్నామనం మాట్లాడుతూనే ఉంటాం. దీన్ని ఛాట్‌బోట్‌ అంటారు. మనిషికి-మనిషికి కన్వర్జేషన్‌ వేరు. మనిషి-కంప్యూటర్ సంభాషణ వేరు. మనిషికి-కంప్యూటర్‌కు మధ్య సంభాషణను మనం ఛాట్‌బోట్‌ అంటాం.

మరి ఛాట్‌ జీపీటీ (ChatGPT) విషయానికి వస్తే.. ఛాట్‌ అంటే మాట్లాడుకోవడం. జీపీటీ అంటే.. జనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (Generative Pre-Trained Transformer). అంటే దీన్ని ముందుగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఛాట్‌బోట్‌లో వెతుకుతున్నవన్నీ ఇప్పటికే ట్రైనింగ్‌ ఇస్తారు. మనం ఏదైనా ప్రశ్న అడిగితే.. దాని మైండ్‌లో అప్పటికే ఆన్సర్‌ ఉంటుంది కాబట్టి.. సమాధానాలు టపాటపా ఇచ్చేస్తుంది. దీన్నే జనరేటివ్‌ ప్రీ ట్రాన్స్‌ఫార్మర్‌ అని పిలుస్తారు. ఇది ఇంటర్నెట్‌ సాయంతో పని చేయదు. మనం ఇంటర్నెట్‌లో ఏది అడిగినా క్షణాల్లో రకరకాలుగా జవాబులు వచ్చేస్తుంటాయి. ఛాట్‌ జీపీటీలో అలా ఉండదు.

ఛాట్‌జీపీటీకి, గూగుల్‌ సెర్చ్‌కి డిఫరెన్స్‌ ఏంటి?

ఛాట్‌జీపీటీని 2022లోనే విడుదల చేశారు. అయితే, దీని డేటా మొత్తం 2021వరకు ఫిక్స్‌ చేశారు. 2022కు సంబంధించిన ఏవైనా అంశాలు మని సెర్చ్‌ చేసినట్లయితే.. ఇది సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఇందులో ముందే సమాధానాలు ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి. ఛాట్‌ జీపీటీకి గూగుల్‌ సెర్చ్‌కు డిఫర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదాహరణకు గూగుల్‌ సెర్చ్‌లో హీరో మహేష్‌బాబు గురించి సెర్చ్‌ చేస్తే వందల కొద్దీ లింక్స్‌, ఫొటోలు, ఆర్టికల్స్‌ వస్తాయి. వాటిని ఓపెన్‌ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. ఏ లింక్‌ పక్కా సమాచారమనే వివరాలు కచ్చితంగా తెలుసుకోలేం. వందలకొద్దీ సమాధానాలు, సమాచారం ఉంటుంది. అందులో మనకు కావాల్సినవి వెతుక్కోవడమే.

అదే ఛాట్‌జీపీటీలోకి వెళ్లి మహేష్‌బాబు అని సెర్చ్‌ చేస్తే అది ఒక్కటే సమాధానం ఇస్తుంది. మహేష్‌బాబు గురించి క్లియర్‌గా ఒక్కటేఫైల్‌లో చెబుతూ వస్తుంది. ఇదీ… బేసిక్‌గా ఛాట్‌జీపీటీకి, గూగుల్‌ సెర్చ్‌కు ఉన్న డిఫరెన్స్‌. గూగుల్‌లో వందల కొద్దీ ఆన్సర్లు ఉంటాయి. ఛాట్‌ జీపీటీలో ఒక్కటే జవాబు వచ్చేస్తుంది. ఈ ఫీచర్‌ ఇప్పుడు చాలా మందికి విపరీతంగా నచ్చేసింది. ఎందుకంటే వంద ఆన్సర్లలో మనకు కావాల్సింది వెతుక్కొనే క్రమంలో సమయం వృధా అవుతుంది. అయితే, ఒక్కటే జవాబు ఉంటే టైమ్‌ కలిసొస్తుంది. మనశ్రమ వృధా కాకుండా ఉంటుంది.

ఎలా వాడాలంటే..

గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి ఛాట్‌ జీపీటీ అని ఎంటర్‌చేసినా వస్తుంది. లేదా వెబ్‌సైట్‌ chat.openai.com అనే సైట్‌లోకి ఎంటర్‌ కావాలి. మొదట గూగుల్‌ జీమెయిల్‌ మాదిరిగానే ఈమెయిల్‌ ఐడీ అడుగుతుంది. మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఓటీపీ వస్తుంది. ప్రాసెస్‌ సింపుల్‌గానే ఉంటుంది. ఇక రిజిస్టర్‌ అయిపోయిన వెంటనే గూగుల్‌ సెర్చ్‌ మాదిరిగానే సెర్చ్‌ బార్‌ కనిపిస్తుంటుంది. మొబైల్‌లో అయినా, సిస్టమ్‌లో అయినా వాడొచ్చు. ఛాట్‌ జీపీటీ సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్‌ మాదిరిగానే అన్నీ వెతకొచ్చు. కాకపోతే ఇందులో సమాధానంగా ఒక్కటే వస్తుంది. పోకిరి సినిమాలో మహేష్‌ బాబు డైలాగ్‌ మాదిరి… ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా… అన్నట్లుగా ఒక్కటే సింగిల్‌ లైన్‌. ఆన్సర్‌ ఫసక్‌.. అనిపించేలా ఛాట్‌ జీపీటీ వ్యవహారం ఉంటుంది.

ఉదాహరణకు రెండూ పక్కపక్కనే ఉంచి చూసుకుంటే.. ఒక బిర్యానీ చేయడం గురించి సెర్చ్‌ చేశారనుకుందాం. How to make biryani అని సెర్చ్‌ చేస్తే.. గూగుల్‌లో అయితే.. రకరకాల వీడియోలు, ఆర్టికల్స్‌ లింకులు, స్విగ్గీ, జొమాటో సహా వందల కొద్దీ మనకు ప్రత్యక్షమవుతాయి. అదే ఛాట్‌ జీపీటీలో ఇదే ప్రశ్న సెర్చ్‌ చేస్తే.. బిర్యానీలో ఏయే ఇంగ్రీడియంట్స్‌ వాడతారు.. కప్పు తీసుకోవాలి, రైస్‌,ఆనియన్స్‌, టమోటా, చికెన్‌… ఇలా కావాల్సినవి, చేసుకొనే విధానం డీటెయిల్డ్‌గా చూపిస్తుంది. కేవలం ఒక్కటే సమాధానం ఉంటుంది.

అతి పెద్ద మైనస్‌ ఇదేనా?

అయితే, ఛాట్‌జీపీటీతో చాలా మందికి సులభంగా మారినప్పటికీ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్‌ విషయంలో ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేసుకోడానికి ఛాట్‌జీపీటీని దుర్వినియోగం చేస్తున్నారని తేలింది. ఎగ్జామ్స్‌లోకి కంప్యూటర్లు, మొబైళ్లు అనుమతించకపోయినప్పటికీ బయట సెర్చ్‌ చేసి సింపుల్‌గా ఒకే సమాధానం చిన్న చీటీలో ప్రింట్‌ తీసుకొని దుర్వినియోగం చేసే సందర్భాలు ఉన్నాయని తేలింది. దీంతో ఇదే అతిపెద్ద మైనస్‌గా ఛాట్‌జీపీటీ అంచనా వేస్తోంది. అయితే, దీన్ని రెక్టిఫై చేసుకొని చాలా వరకు సాల్వ్‌ చేసేలా ఛాట్‌జీపీటీ సెట్టింగులు చేస్తోందని తెలుస్తోంది. మిస్‌యూస్‌ చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని వల్ల పిల్లలు ఏం చదవాల్సిన అవసరం ఉండదనిచెబుతున్నారు. కాపీ కొట్టడం అలవాటైపోతే మొత్తం విద్యావ్యవస్థ దెబ్బతింటుందంటున్నారు.

ఛాట్‌జీపీటీలో ఏదైతే మనం కోరుకుంటున్నామో అది నీట్‌గా ఒక్కే సమాధానంగా చెప్పడం అనేది అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇక గన్‌ ఎలా తయారు చేయాలనే అంశంపై సెర్చ్‌ చేస్తే.. అది లీగల్‌గా కరెక్ట్‌ కాదని చూపిస్తుంది. ఇలాంటి కొన్ని సమస్యలు రెక్టిఫై చేసుకోవాల్సి ఉంది. ఇక ఇంకో మైనస్‌ పాయింట్‌ ఏంటంటే.. కేవలం 2021 వరకే డేటా ఉండటం. ఉదాహరణకు తాజాగా జరిగిన సిరియా, టర్కీలో జరిగిన భూకంపంలో ఎంత మంది మృతి చెందారనే అంశాన్ని వెతికితే అది సమాధానం ఇవ్వలేదు. ఇలా ఇంటర్నెట్‌ ఆధారంగా పని పని చేసే చాలా సమాధానాలను ఛాట్‌జీపీటీ ఇవ్వలేదు.

తాజాగా ఛాట్‌ జీపీటీలోని అంశాలను గూగుల్‌ ముందే పసిగడుతోంది. ఇలాంటి ఆప్షన్లను అమల్లోకి తెచ్చేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గూగుల్‌ చాలా పెద్ద సంస్థ కాబట్టి ఇలాంటివి వెంటనే అమల్లోకి తెచ్చే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఛాట్‌జీపీటీతో అయితే చాలా మందికి ఉపయోగకరంగా మారింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అయితే, చాలా వరకు ఉపయోగంగా ఉంటోందట. తమకు ఎదురయ్యే చాలా రకాల బగ్స్‌ను ఇది సాల్వ్‌ చేస్తోంది.

Read Also : WhatsApp: ఆధార్, పాన్‌ కార్డు వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ చేసేయండి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles