సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Indian Premier League: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ఫైనల్ లిస్టు ఇదే

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 1 నవంబర్ 2024

Indian Premier League: ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట జట్లు తమతో నిలుపుకొనే సభ్యుల వివరాలను వెల్లడించాయి. మెగా వేలం నిర్వహణకు ఐపీఎల్ రిటెన్షన్ లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నిన్నటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ (Indian Premier League) ఎవరిని తమ వద్ద అట్టిపెట్టుకుంటుందన్న ఆసక్తి ఏర్పడింది.

ఏ ఆటగాడు మెగా వేలానికి వస్తాడనే విషయం వెల్లడైంది. గురువారమే చివరి గడువు కావడంతో నిన్న అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల పేరుతో లిస్టు రిలీజ్ చేశాయి. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం (IPL 2025 Auction) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిటెన్షన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ అత్యధికంగా రూ.23 కోట్లు పలికాడు.

ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీని (Virat Kohli) ఆ జట్టు రూ.21 కోట్లకు రిటైన్ చేసుకోవడం విశేషం. అలాగే వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను (Rohit Sharma) ఆ జట్టు రూ.16.30 కోట్లకు, చెన్నై సూపర్ సింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్లకు రిటైన్ అయ్యారు. రిషభ్‌ పంత్‌ను ఢిల్లీ, కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్, శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలేశాయి. మ్యాక్స్‌వెల్, కామెరూన్‌ గ్రీన్‌, సిరాజ్‌లను ఆర్సీబీ రిలీజ్ చేసింది.
ముంబయి ఇండియన్స్‌

రిటైన్ చేసుకున్న జట్లు, ప్లేయర్లు వీరే..

చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)
* రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
* మతిశ పతిరన (రూ.13 కోట్లు
* శివమ్ దూబె (రూ.12 కోట్లు)
* రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
* మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)

ముంబై ఇండియన్స్ (MI)
* జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
* రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
* సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
* హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
* తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)
* విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
* రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
* యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH)
* హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
* పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
* అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
* నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు)
* ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

రాజస్థాన్ రాయల్స్‌ (RR)
* సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
* యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
* రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
* ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
* హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు)
* సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC)
* అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
* కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
* ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
* అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)
* రింకు సింగ్ (రూ.13 కోట్లు)
* వరుణ్‌ చక్రవర్తి (రూ.12 కోట్లు)
* సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
* ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
* హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
* రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

గుజరాత్‌ టైటాన్స్‌ (GT)
* రషీద్‌ ఖాన్‌ (రూ.18 కోట్లు)
* శుభ్‌మన్‌ గిల్‌ (రూ.16.5 కోట్లు)
* సాయి సుదర్శన్‌ (రూ.8.5 కోట్లు)
* రాహుల్‌ తెవాతియా (రూ.4 కోట్లు)
* షారుక్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)
* నికోలస్‌ పూరన్‌ (రూ.21 కోట్లు)
* రవి బిష్ణోయ్‌ (రూ.11 కోట్లు)
* మయాంక్‌ యాదవ్ (రూ.11 కోట్లు)
* మోసిన్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)
* ఆయుష్‌ బదోనీ (రూ.4 కోట్లు)

పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)
* శశాంక్‌ సింగ్‌ (రూ.5.5 కోట్లు)
* ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (రూ.4 కోట్లు)

Read also: IPL 2025: రిటెన్షన్‌లో ఆ స్టార్ ప్లేయర్‌కు రూ.20 కోట్లు?
IPL 2025 Retention: ఆర్సీబీకి కేఎల్ రాహుల్ పునరాగమనం?
IPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?
IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్.. 

ట్యాగ్స్: , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading