Tirumala samacharam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించుకొనేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. కొండపై భక్తుల తాడికి అధికంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవేంకటేశుని సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. (Tirumala samacharam)
శ్రీవారి సర్వ దర్శనానికి కృష్ణ తేజ అతిథిగృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న కలియుగ వైకుంఠ నాథుడిని 87,171 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
వారాంతం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంటోంది. వారం మధ్యలో అయితే కాస్త భక్తుల తాకిడి తక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సిఫార్సు లేఖలు, వీఐపీల తాకిడి కూడా శని, ఆదివారాల్లో ఎక్కువగా ఉంటోంది. దీంతో సర్వ దర్శనంపై ప్రభావం చూపుతోంది. నడక దారి భక్తుల సంఖ్య కూడా శని, ఆదివారాల్లో పెరుగుతోంది.
Read Also : Subramanian swamy: టీటీడీపై చంద్రబాబు, పవన్‌వి తప్పుడు ఆరోపణలు..: సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం
తిరుమలలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గతేడాది ఆదాయ వ్యయాల వివరాలను స్వామి వారికి విన్నవించడమే ఆణివార ఆస్థానం అని వివరించారు.
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..