Sri Venkateswara: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara) వారిని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం కలిసి రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తిరుమల కొండ ప్రతి చోటా శ్రీవారు కనిపిస్తారనేది భక్తుల నమ్మకం. తిరుమల శ్రీవారి ఆదాయం నానాటికీ పెరిగిపోతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య కల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్నాడు. మొన్నామధ్య శ్రీవారి ఆస్తుల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆస్తుల వివరాలు వెల్లడించింది. శ్రీ వారి వద్ద శ్రీవారి వద్ద 15,938 కోట్ల రూపాయల నగదు, 10,258 కిలోల బంగారం ఉన్నట్టు టీటీడీ వెల్లడించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు, బంగారు ఆభరణాలు అన్నీ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని టీటీడీ తెలిపింది. టీటీడీ చరిత్రలో ఇప్పటి దాకా ఏ ప్రభుత్వానికి కూడా డబ్బు ఇవ్వలేదని, భవిష్యత్తులోనూ ఇచ్చేది లేదని ప్రకటించింది.
అయితే, నెల్లూరుకు చెందిన ఓ భక్తుడు ఇటీవల డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ ఫిర్యాదు చేశాడు. 5000 కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోందని తెలిపాడు. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. టీటీడీపై బుదజల్లేందుకు కొన్ని శక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి 960 స్థిర ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ రూ.85,705 కోట్లు. స్వామివారి పేరుతో 7,123 ఎకరాల భూమి ఉందని, టీటీడీకి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.14,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లుఉన్నాయని,14 టన్నుల బంగారం ఉందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్ బోర్డులు స్వామివారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2014 తర్వాత ఇప్పటి వరకు తాము ఎలాంటి ఆస్తులు అమ్మలేదని, టీటీడీకి ఉన్న ఆస్తులు, వాటి విలువలను టీటీడి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీటీడీ వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఏ రోజూ పెట్టుబడులు పెట్టిన సందర్భాలు లేవని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టీకరించారు. ఇప్పటిదాకా 15, 938 కోట్ల రూపాయలను జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చేసినట్టు వివరించారు. ఇకపై కూడా అధిక వడ్డీ వచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తామని వెల్లడించారు.
ఈ మేరకు తిరుమల వెంకన్న ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు ధర్మారెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించినట్ల తేటతెల్లం చేశారు. ఇక శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవ సాయం ద్వారా పండించిన వాటినే వినియోగింస్తున్నట్లు టీటీడీ చాలా సందర్భాల్లో చెబుతూ వస్తోంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడింది. ఇలా ఆస్తుల వివరాలు వెల్లడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఇలా ఆస్తుల వివరాలు బహిర్గతం చేయలేదు.
Read Also : Tirumala: తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? టికెట్లు దొరుకుతాయా?