Subramanian swamy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ టీటీడీపై వీరు ఇలాగే ప్రవర్తించారని పలుమార్లు ప్రస్తావించిన ఆయన.. తాజాగా నిన్న మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా క్షేత్రంలో పోరాడలేక చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సుబ్రహ్మణ్యస్వామి. (Subramanian swamy)
కాగ్ ద్వారా ఆడిట్ చేసేందుకు టీటీడీ (TTD) స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ (Srivani trust) ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని దుష్ర్పచారం చేయడం చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కే (Pawan Kalyan) చెల్లిందని, ఇవి పూర్తిగా తప్పుడు ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబు ఎన్నడూ హిందువులకు ఏం చేయలేదని సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు. సోనియాగాంధీతో (Sonia Gandhi) కలిసి చంద్రబాబు రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. సొంతమామకు గౌరవం ఇవ్వనివాడు హిందువులకు గౌరవం ఎలా ఇస్తాడని ప్రశ్నించారు.
Read Also : Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ.. 23 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు
సీఎం జగన్ (CM YS Jagan) ఎన్నడూ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నకల్లో జగన్‌ను ఢీకొట్టే సత్తా చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు అడ్వాన్స్ స్టేజీలో ఉందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. హిందువుల వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని సుబ్రమణ్యస్వామి హెచ్చరించారు.
మతపరమైన విషయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దన్నారు. టీటీడీ కార్యక్రమాల పై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. రాజకీయాలకే చంద్రబాబు పరిమితమవ్వాలని సూచించారు. టీటీడీకి న్యాయ సహాయం చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారనడం సరికాదన్నారు. త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం చేసుకుంటానని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..