Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ చెంత దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం వేలాదిగా చేరుకుంటున్నారు. సరస్వతి దేవి అలంకారంలో నేడు దుర్గమ్మ భక్తులను కటాక్షించనున్నారు. నేడు మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఇవాళ సుమారు 2.5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఇవాళ వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. (Indrakeeladri)
దుర్గమ్మ సేవలో సీఎం జగన్
నేడు మధ్యాహ్నం దుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకోనున్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పణ చేయనున్నారు. సామాన్య భక్తులకు దర్శనాలు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మ గుడికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తున్నారు. భక్తులను తోసుకోకుండా, క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. వినాయక గుడి నుంచి ఘాట్ రోడ్డు వరకు క్యూలైన్లు ఉన్నాయి. భక్తుల రద్దీని సీపీ కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రోప్‌లతో భక్తులను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. రద్దీ కారణంగా వీఐపీల అంతరాలయ దర్శనాలను పాలక మండలి రద్దు చేసింది. వృద్ధులు, వికలాంగులు కూడా రావొద్దంటూ అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: Tripura Governor: త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి.. రాష్ట్రపతి ఉత్తర్వులు
Srivari Kalyanotsavalu UK : యూకే, యూరప్‌లో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు
Subramanian swamy: టీటీడీపై చంద్రబాబు, పవన్‌వి తప్పుడు ఆరోపణలు..: సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం