Dhanush: నటనకు వయసుతో సంబంధం లేదు.. స్టార్‌డమ్‌తోనూ సంబంధం లేదు. తెరపై పాత్రకు ప్రాణం పోసే ప్రతిభ ఉంటే ప్రేక్షకులే కాదు.. స్టార్ హీరోలు కూడా ప్రశంసించకుండా ఉండలేరు. తాజాగా ఇరుముడి సినిమాలో తన సహజ నటనతో ఆకట్టుకున్న బాలనటి బేబీ నక్షత్ర విషయంలో అదే జరిగింది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఇరుముడి సినిమాలో నక్షత్ర నటనకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ తమిళ నటుడు Dhanush సైతం నక్షత్ర నటనకు ఫిదా అయ్యారు. ఏకంగా స్వయంగా వీడియో కాల్ చేసి చిన్నారిని అభినందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
