HomeAgricultureAnnadata Sukhibhava: రైతులకు పెట్టుబడి సాయంలో ప్రభుత్వ అలక్ష్యం.. ఇప్పటికే 7 లక్షల మంది రైతులకు...

Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి సాయంలో ప్రభుత్వ అలక్ష్యం.. ఇప్పటికే 7 లక్షల మంది రైతులకు సాయం కట్‌

Annadata Sukhibhava: పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. పథకం అమలులో తీవ్ర అలక్ష్యం చూపుతున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకానికి మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టిన చంద్రబాబు రెండో ఏడాది మార్చి నెల వచ్చినా ఇంకా మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇవ్వలేదని, దాని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ నుంచి ప్రధాని చేతుల మీదుగా 13వ తేదీన పీఎం కిసాన్‌ కింద 22వ ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. వైయస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 46.86 లక్షల మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తోందని ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో నాగిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

లబ్ధిదారుల్లో కోత. అరకొర నిధులు
గతంలో వైయస్సార్సీపీ పాలనలో మే నెలాఖరులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్, అక్టోబర్‌లో రెండో ఇన్‌స్టాల్‌మెంట్, మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేవాళ్లం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మార్చి నెల వచ్చినా మూడో ఇన్‌స్టాల్మెంట్‌ నగదు జమ చేయలేదు. అన్నదాత సుఖీభవకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 53.58 లక్షల మందికి రూ.10,716 కోట్లు కావాల్సి ఉంటే కూటమి ప్రభుత్వం రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో 46.86 లక్షల మంది రైతులకు రూ.4,686 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 3 వ విడత విడుదల ప్రకటన ఇంత వరకూ లేదు.

కేంద్ర ప్రభుత్వం పి యం కిసాన్ క్రింద మొదటి విడత 41.22 లక్షల మందికి 824 కోట్లు రెండవ విడత 39.6 లక్షల మందికి 792 కోట్లు కలిపి 1616 కోట్లు విడుదల చేసినది. రేపు 3 వ విడత ఎంత మందికి విడుదల జరుగుతుందో చూడాలి..

రైతు భరోసా సాయం రూ.34,288 కోట్లు
రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు పెట్టుబడి సాయం అందజేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్‌గారు అధికారంలోకి వచ్చాక ఆ సాయం రూ.13,500కి పెంచడమే కాకుండా సాయాన్ని ఐదేళ్లూ కొనసాగించారు. ఆ విధంగా ఒక్కో రైతుకు ఏడాదికి రూ.67,500 సాయం చేయడం జరిగింది. వైయస్సార్సీపీ హయాంలో ఏడాదికి 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం కింద ఐదేళ్లలో రూ.34,288 కోట్లు జమ చేయడం జరిగింది.

కానీ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేసిందే కాకుండా, గత మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ వర్తింపజేస్తానని గొప్పలు చెప్పిన చంద్రబాబు.. కేంద్రం నుంచి ప్రకటన వచ్చినా మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇప్పటికీ జమ చేయలేదు.

కూటమి ప్రభుత్వంలో వ్యవసాయంలో సంక్షోభం:
కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో పంటలు పండక, ఖరీఫ్ లో సాగు ఏరియా గణనీయంగా తగ్గిపోయి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా కంది కొనుగోలు చేసిన రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి చెల్లించలేదు. పంటలు అమ్ముకున్న తర్వాత కూడా నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే వారెలా బతకాలి? మొక్కజొన్న రైతులు ఒక్క రబీలోనే 10 లక్షల ఎకరాలలో సాగు జరిగి క్వింటాలు 2400 రూ కనీస మద్దత్తు ధర అయితే ప్రస్తుతం మార్కెట్ లో 1400 నుండి 1600 ధర ఉంటే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోఏ పరిస్థితి లో ఉన్నారు.

కనీసం ఈ పంట కొనుగోలు ఉసేలేదు. శనగ పంట 9 లక్షల ఎకరాలలో సాగు జరిగి షుమారు 7 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంటే మార్క్‌ఫెడ్‌ ద్వారా కేవలం 94 వేల 500 టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి గారు ప్రకటించారు . గతేడాది పండించిన పంట లక్ష టన్నులు కోల్డ్‌ సోరేజ్‌లో ఉంది. కనీస మద్దత్తు ధర క్వింటాలు 5875 రూ. ప్రస్తుతం మార్కెట్ లో ధర 5000 రూ.దానికి తోడు ప్రభుత్వం ఎంత కొంటారో, కొన్న దానికి డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి లో కనీస గిట్టుబాటు ధర కూడా లేకుండా రైతులు దళారులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.

ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలకు ఇంతవరకు అతీగతీ లేదు. సున్నావడ్డీ రాయితీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవలో మొత్తం కౌలు రైతులను ఎత్తేశారు. ఇంకా మొక్కజొన్న, శనగ పంటలకు మద్ధతు ధర లేకుండా పోవడంతో ఆ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్న రాయలసీమ, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లా ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంవీఎస్‌ నాగిరెడ్డి చెప్పారు.

ఇవీ చ‌ద‌వండి: Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు
YSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం
Annadata Sukhibhava : తొలి ఏడాది కట్.. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ నిధులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు