HomeAgricultureAnnadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి...

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం రెండో విడతలో రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ కానుంది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా రూ.7 వేలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేశాయి. రెండో విడతగా నేడు 2025 నవంబర్ 19న మరో రూ.7 వేల చొప్పున రైతులకు జమ చేయనున్నారు. రెండు విడతల్లో మొత్తంగా రూ.6,309.44 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం రైతులకు కలుగుతోందని ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది.

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా పుట్టపర్తికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నిన్న రాత్రి అక్కడే బస చేశారు. నేడు ఉదయం ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీతో కలిసి శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని ఇరువురు నేతలు దర్శించుకున్నారు. అనంతరం శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహిస్తున్న శతజయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం 1.15 గంటలకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకోనున్నారు. స్థానికంగా గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

ఇవీ చదవండి: YSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం
Annadata Sukhibhava : తొలి ఏడాది కట్.. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ నిధులు
Buggana: అన్నదాత సుఖీభవకు రూ.1000 కోట్లు సరిపోతాయా?
Kakani Govardhan Reddy : పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి: మాజీ మంత్రి కాకాణి ఫైర్‌
Andhra Pradesh : సర్కారు ప్రకటనలేమో ఘనం.. క్షేత్రస్థాయిలో రైతు కంట కన్నీరే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు