HomeCinemaPrabhas : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఓటీటీ డీల్ ఫిక్స్? భారీ ధరకు డిజిటల్ హక్కులు...

Prabhas : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఓటీటీ డీల్ ఫిక్స్? భారీ ధరకు డిజిటల్ హక్కులు అమ్ముడైనట్టు ప్రచారం

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తేనే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు మొదలవుతాయి. ఆయన సినిమాలు విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేయడం ఇప్పుడు సహజంగా మారిపోయింది. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యాక్షన్, మాస్ సినిమాలతో వరుసగా అలరించిన ప్రభాస్‌ను ఈసారి వింటేజ్ లుక్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైనర్ అవతార్‌లో చూడటంతో అభిమానులు మొదట్లో ఫుల్ ఖుష్ అయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చాయి.

మిక్స్డ్ టాక్… అయినా భారీ కలెక్షన్లు

అయితే సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. దర్శకుడు మారుతి చెప్పిన స్థాయిలో కథ, కామెడీ వర్క్ కాలేదని కొంతమంది ప్రేక్షకులు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా సినిమాపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి.

అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజుల్లోనే గట్టి ఓపెనింగ్స్ దక్కించుకోవడంతో నిర్మాతలకు ఊరట కలిగింది.

ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

ఇక థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, మరోసారి చూడాలనుకునే అభిమానులు… రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రూ.80 కోట్లకు ఓటీటీ డీల్?

తాజా సమాచారం ప్రకారం ‘రాజా సాబ్’ సినిమా ఓటీటీ డీల్ పూర్తయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న కథనాల ప్రకారం,
👉 రాజా సాబ్ డిజిటల్ రైట్స్‌ను దాదాపు రూ.80 కోట్లకు విక్రయించారని సమాచారం.
👉 అన్ని భాషల్లో ఒకేసారి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్‌ను యూట్యూబ్‌లో ఒక్కొక్కటిగా విడుదల చేస్తుండటంతో, డిజిటల్ రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు మొదలెట్టినట్టే అనిపిస్తోంది.

ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో ‘రాజా సాబ్’ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశముందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ లేదా ఓటీటీ సంస్థ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ‘రాజా సాబ్’… ఓటీటీలో మాత్రం ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో పెరుగుతోంది.

ఇవీ చదవండి: Prabhas : పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా మరోసారి ప్రూఫ్… ప్రభాస్ క్రియేట్ చేసిన రేర్ రికార్డు!
The Raja Saab Movie review : రాజా సాబ్ మూవీ రివ్యూ.. ప్రభాస్ హారర్-కామెడీలో ఉతికేశాడు.. ఓవరాల్ గా ఎలా ఉంది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు