HomeCinemaPrabhas : పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా మరోసారి ప్రూఫ్… ప్రభాస్ క్రియేట్ చేసిన...

Prabhas : పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా మరోసారి ప్రూఫ్… ప్రభాస్ క్రియేట్ చేసిన రేర్ రికార్డు!

Prabhas : పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా విడుదలైన ఆయన లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతోంది.

సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన రాజాసాబ్ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.238 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ప్రభాస్ ఖాతాలో మరో చరిత్రాత్మక రికార్డు చేరింది.

రూ.200 కోట్ల క్లబ్‌లో ఏడు సినిమాలు… తొలి తెలుగు హీరో ప్రభాస్!
రాజాసాబ్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏడు సినిమాలు ఉన్న తొలి తెలుగు నటుడిగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు బాహుబలి – ది బిగినింగ్, బాహుబలి – ది కన్‌క్లూజన్, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు ఈ మార్క్‌ను దాటాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా ఆ లిస్టులో చేరింది.

ఇది టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా, ఇండియన్ సినిమా స్థాయిలో కూడా రేర్ అండ్ హిస్టారికల్ రికార్డుగా నిలుస్తోంది.

మిక్స్‌డ్ టాక్ అయినా తగ్గని ప్రభాస్ మార్కెట్
రాజాసాబ్ సినిమాకు కథ, ట్రీట్మెంట్ విషయంలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా…
ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ కలెక్షన్స్ స్పష్టంగా చెబుతున్నాయి.

ప్రభాస్ పేరు మీద ఉన్న ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ మార్కెట్ స్ట్రెంగ్త్ వల్లే సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్లింది. ముఖ్యంగా నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లో ప్రభాస్ ఫ్యాన్ బేస్ మరింత బలపడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఈ హిస్టారికల్ రికార్డ్‌తో ప్రస్తుతం #PanIndiaStarPrabhas, #RebelStar, #RajaSaab హ్యాష్‌ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ప్రభాస్‌ను “పాన్ ఇండియా నెంబర్ 1 హీరో” అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రభాస్ బ్రాండ్ పవర్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉందని మరోసారి రుజువైంది.

ఇవీ చదవండి: The Raaja Saab : ది రాజా సాబ్ 2 రోజుల కలెక్షన్లు.. 2026లో రూ.100 కోట్ల ఓపెనర్!
The Raja Saab 1st Day : రాజా సాబ్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు