HomeBusinessGold Price: బంగారం.. అందనంత ఎత్తుకు.. రికార్డు స్థాయికి చేరుకున్న గోల్డ్ ప్రైస్.. తులం ఎంతంటే

Gold Price: బంగారం.. అందనంత ఎత్తుకు.. రికార్డు స్థాయికి చేరుకున్న గోల్డ్ ప్రైస్.. తులం ఎంతంటే

Gold Price: బంగారం ప్రియులకు ఇది నిజంగా షాక్ ఇచ్చే వార్తే. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిపుణులు ముందుగానే హెచ్చరించినట్టే, గోల్డ్ రేట్లు ఇప్పుడు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి అధికమవడం వల్ల ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో కూడా గోల్డ్ ధరల్లో షాక్ తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

📍 ప్రధాన నగరాల్లో గోల్డ్ & సిల్వర్ రేట్లు

చెన్నై
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,40,630
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,28,910
వెండి (1 కిలో): ₹2,54,100

ముంబై
24 క్యారెట్ల బంగారం: ₹1,40,030
22 క్యారెట్ల బంగారం: ₹1,28,360
వెండి: ₹2,40,100

ఢిల్లీ
24 క్యారెట్ల బంగారం: ₹1,40,180
22 క్యారెట్ల బంగారం: ₹1,28,510
వెండి: ₹2,40,100

కోల్‌కతా
24 క్యారెట్ల బంగారం: ₹1,40,030
22 క్యారెట్ల బంగారం: ₹1,28,360
వెండి: ₹2,40,100

హైదరాబాద్
24 క్యారెట్ల బంగారం: ₹1,40,030
22 క్యారెట్ల బంగారం: ₹1,28,360
వెండి: ₹2,54,100

విజయవాడ
24 క్యారెట్ల బంగారం: ₹1,40,030
22 క్యారెట్ల బంగారం: ₹1,28,360
వెండి: ₹2,54,100

విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం: ₹1,40,030
22 క్యారెట్ల బంగారం: ₹1,28,360
వెండి: ₹2,54,100

మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ధరలు, స్థానిక డిమాండ్–సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాలపై ఆధారపడి ధరలు రోజులోనే మారవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు ప్రత్యక్ష ధరలను తప్పనిసరిగా చెక్ చేయడం మంచిది. లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరల అప్‌డేట్ కోసం 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇవీ చదవండి: Gold Prices Today: ఐదు రోజుల్లో రూ.5 వేలు పెరిగిన బంగారం ధరలు
Gold and Silver Rate: తగ్గేదే లే అంటున్న బంగారం… రోజుకో షాక్ ఇస్తున్న పసిడి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు