HomeBusinessGold Prices Today: ఐదు రోజుల్లో రూ.5 వేలు పెరిగిన బంగారం ధరలు

Gold Prices Today: ఐదు రోజుల్లో రూ.5 వేలు పెరిగిన బంగారం ధరలు

Gold Prices Today: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి దూసుకుపోతున్నాయి. రోజురోజుకీ కొత్త గరిష్ఠాలకు చేరుకుంటూ సామాన్యుడి జేబుకు షాక్ ఇస్తున్నాయి. పండుగల సీజన్ నడుస్తుండటంతో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ ట్రెండ్స్ కలిసి రావడంతో గోల్డ్ రేట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. బంగారంతో పాటు వెండి కూడా భారీగా ఎగబాకుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. శుక్రవారం తెలుగు రాష్ట్రాలు సహా ప్రధాన నగరాల్లో బంగారం–వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తులం బంగారం ధరలు
హైదరాబాద్: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,39,260 (నిన్న రూ.1,39,250). 22 క్యారెట్ల ధర రూ. 1,27,660.
విజయవాడ: 24 క్యారెట్లు రూ. 1,39,260; 22 క్యారెట్లు రూ. 1,27,660.
విశాఖపట్నం: 24 క్యారెట్లు రూ. 1,39,260; 22 క్యారెట్లు రూ. 1,27,660.
ఢిల్లీ: 24 క్యారెట్లు రూ. 1,39,410; 22 క్యారెట్లు రూ. 1,27,810.
చెన్నై: 24 క్యారెట్లు రూ. 1,39,870; 22 క్యారెట్లు రూ. 1,28,210.
బెంగళూరు: 24 క్యారెట్లు రూ. 1,39,260; 22 క్యారెట్లు రూ. 1,27,660.

వెండి ధరలు
బెంగళూరు: కేజీ వెండి రూ. 2,34,100 (నిన్న రూ.2,34,000).
హైదరాబాద్: కేజీ వెండి రూ. 2,45,100.
విజయవాడ, విశాఖపట్నం: కేజీ వెండి రూ. 2,45,100.
చెన్నై: కేజీ వెండి రూ. 2,45,100.

బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ప్రస్తుతం ధరలు ఊరట ఇవ్వడం లేదు. పండుగల డిమాండ్, గ్లోబల్ మార్కెట్ సంకేతాల మధ్య రేట్లు ఇంకా కదిలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవీ చదవండి: Gold and Silver Rate: తగ్గేదే లే అంటున్న బంగారం… రోజుకో షాక్ ఇస్తున్న పసిడి!
Rahu Transit 2026: కష్టాలకు ముగింపు.. 2026లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు