Meenakshi Choudhary : టాలీవుడ్‌లో ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ Meenakshi Chaudhary ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. డెబ్యూ తర్వాత యంగ్ హీరోల సినిమాల నుంచీ స్టార్ హీరోల ప్రాజెక్టుల వరకు బ్యాక్‌టుబ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఏ సినిమా చూసినా… ఆ సినిమాలో మీనాక్షి పేరు కనిపించే స్థాయికి ఆమె క్రేజ్ పెరిగింది. తెలుగులో వరుస హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే తన తమిళ్ డెబ్యూ చిత్రాన్ని ప్రకటించనుండగా, అక్కడ కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయని టాక్.
గత సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్న మీనాక్షి, మరోసారి పండగ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ స్టార్ Naveen Polishetty హీరోగా నటిస్తున్న అనగనగ ఓ రాజు సినిమాలో ఆమె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ ఉంది.
ఇదిలా ఉంటే, త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాలోనూ మీనాక్షి భాగమవుతుందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవీ చదవండి: Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. రెడ్ డ్రెస్‌లో ఘాటు పోజులు
