Health tips : మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. చాలామందికి చిన్నచిన్న సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోరు — కానీ అవి మన శరీరంలో విటమిన్ల కొరతకు సంకేతాలే కావచ్చు. ప్రతి లక్షణం వెనుక ఏ విటమిన్ లోపం ఉందో తెలుసుకుంటే, మనం సులభంగా దాన్ని నియంత్రించగలం. డాక్టర్ వద్దకు వెళ్లకముందే మీ శరీరం మీకు ఇస్తున్న హెచ్చరిక సంకేతాలు ఇవే👇
🩸 పెదవులు చిట్లిపోవడం
కారణం: విటమిన్ B2 (రిబోఫ్లేవిన్), B3 (నియాసిన్), B6, ఐరన్ లోపం.
పరిష్కారం: పాల ఉత్పత్తులు, గుడ్లు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సజ్జలు, మినప్పప్పు ఎక్కువగా తీసుకోవాలి.
💆♀️ తలలో చుండ్రు
కారణం: జింక్, B6, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం.
పరిష్కారం: ఫిష్, వాల్‌నట్స్, గుడ్లు, పప్పులు, సీడ్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చాలి.
🤕 తరచూ తలనొప్పి
కారణం: మ్యాగ్నీషియం, B2 కొరత.
పరిష్కారం: అరటిపండ్లు, పాలకూర, బాదం, అవోకాడో వంటి పదార్థాలు సహాయపడతాయి.
😴 అలసట
కారణం: విటమిన్ B12, D, ఐరన్ లోపం.
పరిష్కారం: గుడ్లు, చేపలు, మాంసం, సూర్యకాంతి, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
💪 బలహీనత
కారణం: B1, D, మ్యాగ్నీషియం లోపం.
పరిష్కారం: గోధుమ, శనగలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఆహారంలో చేర్చాలి.
💇♀️ జుట్టు రాలడం
కారణం: బయోటిన్ (B7), A, E లోపం.
పరిష్కారం: గుడ్లు, వేరుశెనగలు, పాలకూర, కారెట్లు, వాల్‌నట్స్ తినాలి.
💅 గోర్లు విరగడం
కారణం: బయోటిన్, జింక్, D లోపం.
పరిష్కారం: గుడ్లు, కాయగూరలు, పాలు, సూర్యకాంతి తగినంతగా పొందాలి.
🧴 చర్మం పొడిబారడం
కారణం: విటమిన్ C, E, ఒమేగా–3 లోపం.
పరిష్కారం: ఫ్రూట్స్, అవోకాడో, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి.
👩⚕️ ముడతలు, చర్మ సమస్యలు
కారణం: A, జింక్, E లోపం.
పరిష్కారం: టమోటా, కారెట్లు, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
😡 మూడ్ స్వింగ్స్
కారణం: D, B6, మ్యాగ్నీషియం లోపం.
పరిష్కారం: సూర్యకాంతి, గుడ్లు, పాలు, వేరుశెనగలు, అరటిపండ్లు.
🦴 ఎముకలు బలహీనంగా మారడం
కారణం: D, K, కాల్షియం లోపం.
పరిష్కారం: పాలు, పన్నీర్, సూర్యకాంతి, పాలకూర వంటి ఆహారాలు తీసుకోవాలి.
🦷 దంతాల నుండి రక్తం రావడం
కారణం: విటమిన్ C, K, జింక్ లోపం.
పరిష్కారం: నిమ్మకాయ, కమలపండు, బెర్రీలు, ఆకుకూరలు తినాలి.
🏃♀️ కండరాల నొప్పులు
కారణం: మ్యాగ్నీషియం, పొటాషియం లోపం.
పరిష్కారం: బనానా, బాదం, బంగాళాదుంపలు, పాలకూర తినండి.
🤧 తరచూ ఇన్ఫెక్షన్‌లు
కారణం: విటమిన్ C, జింక్, D లోపం.
పరిష్కారం: పండ్లు, సూర్యకాంతి, నట్స్, గ్రీన్ వెజిటబుల్స్.
🧑🦱 చర్మం తెల్లబడడం
కారణం: B12, ఐరన్, C లోపం.
పరిష్కారం: గుడ్లు, మాంసం, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి.
🌙 రాత్రి చూపు తగ్గడం
కారణం: విటమిన్ A, జింక్ లోపం.
పరిష్కారం: కారెట్లు, బీట్‌రూట్, పాలు, బాదం తినాలి.
🧠 జ్ఞాపకశక్తి తగ్గడం
కారణం: B12, ఒమేగా–3, E లోపం.
పరిష్కారం: చేపలు, నట్స్, గుడ్లు, పాల ఉత్పత్తులు తినండి.
🩹 గాయాలు నెమ్మదిగా మానడం
కారణం: విటమిన్ C, జింక్, ప్రోటీన్ లోపం.
పరిష్కారం: పండ్లు, గుడ్లు, పప్పులు, పాలు తినండి.
⚡ చేతులు/కాళ్లలో తిమ్మిరి
కారణం: B12, B1, B6 లోపం.
పరిష్కారం: గుడ్లు, చేపలు, శనగలు, పాలకూర వంటి ఆహారాలు తీసుకోవాలి.
ప్రతి చిన్న లక్షణం కూడా మన శరీరం నుంచి వచ్చే సిగ్నల్ అని గుర్తించండి. ఆహారంలో తగిన విటమిన్లు, మినరల్స్ చేర్చడం ద్వారా చాలా సమస్యలు నివారించవచ్చు. ఒకవేళ లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే, వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
ఇవీ చదవండి: Health tips : మగవాళ్లు చేసే ఈ తప్పులతో మహిళల ఆరోగ్యానికి దెబ్బ!
Kidney Health : పసుపుతో ఇలా చేశారంటే మీ కిడ్నీలు సేఫ్!
